సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్ : దసరా ఉత్సవాల సందర్భంగా సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేస్తున్న కేశఖండనశాల, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు పరిశీలించారు. స్నానఘాట్లు, క్యూలైన్లను పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.