BREAKING
హెచ్-1బీ నుంచి పీఈఆర్‌ఎం ద్వారా గ్రీన్ కార్డ్ పొందే ఉద్యోగుల సంఖ్య పరిమితమే: నాస్కామ్ కీలక ప్రకటన! ముక్కామల గ్రంథాలయంలో అడవి బాపిరాజు 131వ జయంతి వేడుకలు అర్హులైన ప్రతి ఓటరుకు ఓటర్ల జాబితాలో చోటు కల్పించాలి..జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మహేష్ కుమార్ గోటేటి రామమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్.. ముక్కామల జాతీయ రహదారి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.. క్షయ వ్యాధి నిర్మూలన పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..:జిల్లా జాయింట్ కలెక్టర్ నైడియా దేవి. లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా మద్యం షాపుల లైసెన్సులు.... జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బారావు.. వైసీపీ గెలుపునకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి.. కొల్లు త్రినాధ వర్మ.. స్పైస్‌జెట్‌కు ఊరట: ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 150 కోట్ల తొలి విడత ఈసీఎల్‌జీఎస్ నిధులు విడుదల! వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం అభ్యంతరం: జీఎస్టీ కౌన్సిల్ భేటీ: ఫేస్‌లెస్, పారదర్శక పన్ను విధానం దిశగా కీలక అడుగు...కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన! పోర్ట్స్ క్యూ2 ఫలితాల ప్రివ్యూ: అంతరాయాలున్నా సానుకూలంగానే కార్గో అవుట్‌లుక్.. విదేశీ ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం: మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం*

ముక్కామల జాతీయ రహదారి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

Select Suryaa Now
ముక్కామల జాతీయ రహదారి పనులను  పరిశీలించిన జిల్లా కలెక్టర్..

అమలాపురం  మేజర్ న్యూస్ :అమలాపురం–ముక్కామల జాతీయ రహదారి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ అమలాపురం–ముక్కామల జాతీయ రహదారి పరిధిలోని సరళపల్లి రీవిట్మెంట్ వాల్ ఆనుకుని జరుగుతున్న రహదారి పనులను ఇరిగేషన్, జాతీయ రహదారులు, రోడ్లు–భవనాల శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారి పనుల నాణ్యత, నిర్మాణ సామర్థ్యం, నీటి ప్రవాహం, వరదల సమయంలో నీటి ప్రవాహ వేగం వంటి అంశాలను అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు

.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి నిర్మాణ పనుల్లో ఎటువంటి లోపాలకు తావు లేకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ, భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ముక్కామల–అమలాపురం జాతీయ రహదారి పరిధిలో నీటి ప్రవాహం వేగానికి గురయ్యే ప్రాంతాలను శాస్త్రీయంగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో రహదారి భద్రతకు అవసరమైన రక్షణ చర్యలను సత్వరమే చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

 రహదారి పనులపై ఇరిగేషన్, జాతీయ రహదారులు, రోడ్లు–భవనాల శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.ప్రస్తుత పనుల పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి, అవసరమైన చోట్ల పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, భవిష్యత్తులో ఇటువంటి లోపాలు పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాళికతో పనులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ పర్యటనలో ఆర్ అండ్ బి ఈ ఈ రాము, ఇరిగేషన్ ఏఈ వెంకటేశ్వరరావు నేషనల్ హైవే ఏఈ వెంకటరమణ    తదితరులు పాల్గొన్నారు