BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం*

Select Suryaa Now
త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం*

 

 అందుగులలో 13వ శతాబ్దపు ప్రాచీన త్రికోట శివాలయ మరమ్మత్తుల పనులకు రూ. 22లక్షలు మంజూరు…

ముఖ్య అతిథిగా హాజరై మరమ్మత్తు పనులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంఖుస్థాపన*

మాడ్గుల మండలంలోని అందుగుల గ్రామ శివారులో 13వ శతాబ్దానికి చెందిన ప్రాచీన త్రికోట శివాలయానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఈ ఆలయ మరమ్మత్తులకు 22లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. మాడ్గుల మండలం అందుగుల త్రికోట శివాలయ మరమ్మత్తు పనులకు గురువారం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే కసిరెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రికోట శివాలయం ఎన్నో శతాబ్దాల చరిత్రకు, ఆధ్యాత్మిక విశిష్టతకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. ప్రాచీన ఆలయాలు కేవలం భక్తి కేంద్రాలే కాకుండా మన ప్రాంత చరిత్ర, సంస్కృతి, వారసత్వానికి గుర్తులుగా నిలుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణంలో ఏర్పడిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మరమ్మతులు చేపట్టి ఆలయ ప్రాచీనతకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు నిర్వహించాలని సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు.పురాతన కట్టడాలు, దేవాలయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆలయ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రాచీన నిర్మాణ శైలిని కాపాడుతూ పనులు పూర్తి చేయాలని అధికారులను, సంబంధిత సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు.ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కూడా తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ప్రాచీన త్రికోట శివాలయం మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేసి శంఖుస్థాపన చేయడం పట్ల గ్రామస్థులు, నాయకులు, భక్తులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి యాచారం వెంకటేశ్వర్లుగౌడ్, అందుగుల మాజీ సర్పంచ్ అందుగుల జయలక్ష్మీరాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నూధిన కొండల్ రెడ్డి, మాధిని శ్రీనివాస్ రెడ్డి, సింగిరెడ్డి డైరెక్టర్ కొప్పుల జగన్ గౌడ్, ఆర్యపల్లి, కొత్తబ్రాహ్మణపల్లి సర్పంచులు కల్లా భాగ్యలక్ష్మీ తిరుపతిరెడ్డి, దుగ్గింపూడి మల్లారెడ్డి, మాడ్గుల మాజీ ఉపసర్పంచ్ అ‌న్నెపాక (మిద్దె) రాములు, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఆర్.నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల