క్షయ వ్యాధి నిర్మూలన పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..:జిల్లా జాయింట్ కలెక్టర్ నైడియా దేవి.
.అమలాపురం, మేజర్ న్యూస్ :సమాజంలో క్షయ వ్యాధి నిర్మూలన పై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని టీబీ ముక్త భారత అభియాన్ కోసం కార్యక్రమంలో పాల్గొని టీవీ ముక్తభారత్ 3.O పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్, టీబి సెక్షన్ అధికారులతో కలిసి టీబి ముక్తభారత్ 3.0 ప్రతిజ్ఞ చేసి జెండా ఊపి ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూసమాజం లో క్షయ వ్యాధి నిర్మూలన పై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా దేశవ్యాప్తంగా క్షయ వ్యాధిని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం 'టిబి ముక్త్ భారత్ 3.0' కార్యక్రమాన్ని ఢిల్లీ వేదికగా అధికారికంగా ప్రారంభించిందని, వివిధ శాఖల ఇంటర్ డిపార్ట్‌మెంటల్ సమన్వయంతో పాటు ప్రజల భాగస్వామ్యంతో సమాజం నుండి టిబి వ్యాధిని పూర్తిగా నిర్మూలించడమే దీని ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
జిల్లా స్థాయిలో కలెక్టర్ ఛైర్మన్‌గా 11 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ పనిచేస్తుందని,
బ్లాక్ లేదా మండల స్థాయిలో మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఎన్‌సీసీ క్యాడెట్లు, 'మై భారత్' వాలంటీర్లతో కూడిన "జోష్ టీమ్స్" పనిచేస్తాయని ఆమె తెలిపారు.ఈ నెలలో ఎంపిక చేసిన 5 అధిక ముప్పు ఉన్న హై రిస్క్ గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నారని,ప్రజల్లో టిబి వ్యాధిపై అవగాహన కల్పించడం మరియు ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
టిబి లక్షణాలు దీర్ఘకాలిక దగ్గు ఉన్నవారిని గుర్తించి పీహెచ్‌సీలలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారని,వ్యాధి నిర్ధారణ అయిన వారికి తగిన మందులు, పోషకాహారం న్యూట్రిషన్ ఫుడ్ అందజేస్తారని తెలియజేసారు.అలాగే పాత టిబి రోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
పొగాకు, సిగరెట్ వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలపై అవగాహన కల్పించి, వాటికి దూరంగా చర్యలు తీసుకుంటారని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డిఎల్ఎటి ఓ-ఎం.ఓ డా ఎం రామానుజ రావు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సుధా సూర్యనారాయణ రాఘవేంద్ర లక్ష్మి వనిత శ్రీనివాసరావు ఇతర సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.