మంత్రుల పర్యటనలప్పుడే రోడ్లు గుర్తొస్తాయా..పొంగులేటి పర్యటన వేళ హడావుడిగా మరమ్మతులు.
మంత్రుల పర్యటనలప్పుడే రోడ్లు గుర్తొస్తాయా.
* పొంగులేటి పర్యటన వేళ హడావుడిగా మరమ్మతులు.
దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుమ్ముగూడెం మండల పర్యటన నేపథ్యంలో అధికారులు హడావుడిగా రహదారి మరమ్మతులు చేపట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు.భద్రాచలం- చర్ల ప్రధాన రహదారిపై గత మూడేళ్లుగా భారీ గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం..ఇప్పుడు మంత్రి రాక కోసం జేసీబీలతో మెటల్ చిప్స్ వేసి తాత్కాలికంగా పూడ్చివేస్తోంది.కేవలం మంత్రులు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి పనులు చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గతంలో మంత్రి సీతక్క పర్యటన సమయంలోనూ ఇదే విధంగా చేశారని సామాన్య ప్రజల ప్రాణాల కంటే మంత్రుల ప్రయాణమే ముఖ్యమా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ఈ రహదారి నిర్మాణం కోసం ర్యాలీలు, నిరసనలు చేపట్టి ప్రశ్నించినప్పుడల్లా రోడ్డు మంజూరు ఆర్డర్ కాపీ చూపించడం తప్ప ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో చేసిందేమీ లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా తాత్కాలిక పనులతో సరిపెట్టకుండా శాశ్వత రహదారి నిర్మాణం చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
దుమ్ముగూడెం సూర్య రిపోర్టర్.. కల్లూరి సుమన్..