రాజంపేటలో పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ
సూర్య రాజంపేట: రాజంపేట లో బుధవారం వితంతు, వికలాంగుల పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని గ్రామపంచాయతీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుబ్బని శ్రీకాంత్, స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్ జానకి కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.