BREAKING
పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామం లో వూరిటి వెంకటప్పయ్య పెద్దకర్మకు హాజరైన పొన్నూరు వైసిపీ సమన్వయకర్త అంబటి. మురళీకృష్ణ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పంట రైతులది.. కష్టాలు ప్రయాణికులవి! --పుణ్యపురం–సిరిపురం రహదారిపై ధాన్యం రాశులు.. ---గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ---వాహనదారులకు తప్పని అవస్థలు.. ప్రమాదాల ముప్పుతో ప్రజల ఆందోళన రెండుసార్లు స్కూల్ కమిటీ చైర్మన్‌గా సేవలు.. నరసాపురం పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో నాగప్ప! దీక్ష దివస్ సభను విజయవంతం చేయాలి - మాజీ ఎంపీ వినోద్ కుమార్ కసింకోటలో అక్రమ వసూళ్ల కలకలం: ‘మంచివాడు’ అంటూనే నిండా ముంచేశాడు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ.. గుజరాత్‌లో జరగనున్న జాతీయ పోటీలకు మంజుల ప్రాతినిధ్యం మంత్రుల పర్యటనలప్పుడే రోడ్లు గుర్తొస్తాయా..పొంగులేటి పర్యటన వేళ హడావుడిగా మరమ్మతులు. రాజంపేటలో పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ 13వ వార్డులో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి విస్తృత ప్రచారం 28 న అనంతపురం జిల్లా మహిళల సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు అమెరికా దాటి బ్రిటన్‌కు అమెజాన్ ఆటోస్ విస్తరణ ఆఫ్రికాలో తిరుగుబాటుదారుల కొత్త అస్త్రం పుదుచ్చేరి శివారు ప్రాంతాల్లో జోరు వాన.. భారీ వర్షాల హెచ్చరిక జారీ శ్రీలంక తోట కార్మికులకు భారత్ గృహ నిర్మాణ ప్రాజెక్టు విస్తరణ

కసింకోటలో అక్రమ వసూళ్ల కలకలం: ‘మంచివాడు’ అంటూనే నిండా ముంచేశాడు

Select Suryaa Now
కసింకోటలో అక్రమ వసూళ్ల కలకలం: ‘మంచివాడు’ అంటూనే నిండా ముంచేశాడు

కసింకోట, మెజర్ న్యూస్ (అనకాపల్లి జిల్లా):
కసింకోట గ్రామ పంచాయతీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థిగా నడింపల్లి సన్యాసిరావు ఏకగ్రీవం కావడంతో, ఇదే అదనుగా భావించిన ఓ వ్యక్తి ఆయన పేరును అడ్డుపెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడి స్థానిక నాయకులు, కార్యకర్తలను నిండా ముంచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలాగే పోటీలో ఉన్న ఒక వార్డ్ మెంబర్ కు వ్యతిరేకంగా మరో వ్యక్తిని పోటీలో పెట్టిన విషయంపై ఇప్పటికే ఒక కుల సంఘం ఈయన తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఎంపీ ,ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
​అసలేం జరిగిందంటే...
కసింకోట పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో నడింపల్లి సన్యాసిరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందరూ ఆయనను "మంచివాడు" అని నమ్మి పంచాయతీ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ ఏకగ్రీవ ప్రక్రియను ఆసరాగా చేసుకుని సన్యాసిరావు పేరుతో ఓ వ్యక్తి భారీ ఎత్తున అక్రమ వసూళ్లకు తెరలేపాడు. ఎన్నికల ఖర్చుల పేరిట, ఇతర వ్యవహారాల కోసమంటూ అక్రమ వసూళ్ల కు పాల్పడి వార్డు మెంబర్లు, కూటమి నాయకులు, కార్యకర్తల కు ఖర్చులకు ఇస్తామన్న  డబ్బులు ఇవ్వడం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
​"మంచివాడు అంటూనే ముంచేశాడు"
నాయకులు, కార్యకర్తలు నమ్మకంతో డబ్బులు ఇచ్చిన తర్వాత, అసలు విషయం బయటపడటంతో వారంతా కంగుతిన్నారు. తమకు తెలియకుండానే తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడని, "మంచివాడు అంటూనే మమ్మల్ని నిండా ముంచేశాడు" అంటూ బాధిత వార్డు మెంబర్లు, కూటమి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అక్రమ వసూళ్ల వ్యవహారం కసింకోట పంచాయతీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై కూటమి పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి