BREAKING
హెచ్-1బీ నుంచి పీఈఆర్‌ఎం ద్వారా గ్రీన్ కార్డ్ పొందే ఉద్యోగుల సంఖ్య పరిమితమే: నాస్కామ్ కీలక ప్రకటన! ముక్కామల గ్రంథాలయంలో అడవి బాపిరాజు 131వ జయంతి వేడుకలు అర్హులైన ప్రతి ఓటరుకు ఓటర్ల జాబితాలో చోటు కల్పించాలి..జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మహేష్ కుమార్ గోటేటి రామమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్.. ముక్కామల జాతీయ రహదారి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.. క్షయ వ్యాధి నిర్మూలన పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..:జిల్లా జాయింట్ కలెక్టర్ నైడియా దేవి. లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా మద్యం షాపుల లైసెన్సులు.... జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బారావు.. వైసీపీ గెలుపునకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి.. కొల్లు త్రినాధ వర్మ.. స్పైస్‌జెట్‌కు ఊరట: ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 150 కోట్ల తొలి విడత ఈసీఎల్‌జీఎస్ నిధులు విడుదల! వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం అభ్యంతరం: జీఎస్టీ కౌన్సిల్ భేటీ: ఫేస్‌లెస్, పారదర్శక పన్ను విధానం దిశగా కీలక అడుగు...కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన! పోర్ట్స్ క్యూ2 ఫలితాల ప్రివ్యూ: అంతరాయాలున్నా సానుకూలంగానే కార్గో అవుట్‌లుక్.. విదేశీ ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం: మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం*

ముక్కామల గ్రంథాలయంలో అడవి బాపిరాజు 131వ జయంతి వేడుకలు

Select Suryaa Now
ముక్కామల గ్రంథాలయంలో అడవి బాపిరాజు 131వ జయంతి వేడుకలు

తూర్పుగోదావరి జిల్లా, పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలోని శ్రీ ఇనుప కోళ్ల రాఘవరావు మెమోరియల్ శాఖా గ్రంథాలయంలో కళామతల్లి ముద్దుబిడ్డ, బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి బాపిరాజు 131వ జయంతి వేడుకలను అక్టోబర్ 8వ తేదీ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కరటూరి కామేశ్వరరావు, పాతూరి వెంకటేశ్వరరావు, సుంకవల్లి వెంకటగిరితో పాటు పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కరటూరి కామేశ్వరరావు మాట్లాడుతూ, అడవి బాపిరాజు సాహిత్యం, చిత్రకళ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన రచించిన నారాయణరావు నవల విశేష ప్రాచుర్యం పొందిందని తెలిపారు. 

ఆ కాలంలో విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలు నవలతో పోటీపడి ఆంధ్ర కళాపరిషత్తులో ప్రథమ బహుమతి సాధించడం ఆయన సాహితీ ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. అడవి బాపిరాజు చిత్రీకరించిన అజంతా, ఎల్లోరా గుహల చిత్రాలు విశేష ఖ్యాతిని సంపాదించి దేశవిదేశాల్లో గుర్తింపు పొందాయని తెలిపారు.

 సాహిత్యం, చిత్రకళకు ఆయన అందించిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇలాంటి మహనీయుల జయంతి కార్యక్రమాలను గ్రంథాలయాల్లో నిర్వహించడం ద్వారా విద్యార్థులు, యువతలో సాహిత్యం, కళల పట్ల ఆసక్తిని పెంపొందించవచ్చని అన్నారు.