BREAKING
హెచ్-1బీ నుంచి పీఈఆర్‌ఎం ద్వారా గ్రీన్ కార్డ్ పొందే ఉద్యోగుల సంఖ్య పరిమితమే: నాస్కామ్ కీలక ప్రకటన! ముక్కామల గ్రంథాలయంలో అడవి బాపిరాజు 131వ జయంతి వేడుకలు అర్హులైన ప్రతి ఓటరుకు ఓటర్ల జాబితాలో చోటు కల్పించాలి..జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మహేష్ కుమార్ గోటేటి రామమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్.. ముక్కామల జాతీయ రహదారి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.. క్షయ వ్యాధి నిర్మూలన పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..:జిల్లా జాయింట్ కలెక్టర్ నైడియా దేవి. లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా మద్యం షాపుల లైసెన్సులు.... జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బారావు.. వైసీపీ గెలుపునకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి.. కొల్లు త్రినాధ వర్మ.. స్పైస్‌జెట్‌కు ఊరట: ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 150 కోట్ల తొలి విడత ఈసీఎల్‌జీఎస్ నిధులు విడుదల! వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం అభ్యంతరం: జీఎస్టీ కౌన్సిల్ భేటీ: ఫేస్‌లెస్, పారదర్శక పన్ను విధానం దిశగా కీలక అడుగు...కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన! పోర్ట్స్ క్యూ2 ఫలితాల ప్రివ్యూ: అంతరాయాలున్నా సానుకూలంగానే కార్గో అవుట్‌లుక్.. విదేశీ ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం: మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం*

వైసీపీ గెలుపునకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి.. కొల్లు త్రినాధ వర్మ..

Select Suryaa Now
వైసీపీ గెలుపునకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి.. కొల్లు త్రినాధ  వర్మ..

అమలాపురం మేజర్ న్యూస్ :డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రెస్ క్లబ్‌లో అగ్నికుల క్షత్రియుల వైసీపీ నాయకుల సమావేశం గురువారం నిర్వహించారు. వైసీపీ ఆర్టీఐ ఐటీ జోన్-2 రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు త్రినాథ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వైసీపీ మత్స్యకార నాయకులు, అగ్నికుల క్షత్రియుల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అగ్నికుల క్షత్రియులకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు అగ్నికుల క్షత్రియులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.నామినేటెడ్ పదవుల భర్తీలో తమ సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వైసీపీ ఆర్టీఐ ఐటీ జోన్-2 రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు త్రినాథ వర్మ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల ఉపాధి, అభివృద్ధి కోసం ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మత్స్యకారులకు, అగ్నికుల క్షత్రియులకు తగిన రాజకీయ అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. ప్రజలు ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో ఆ వ్యతిరేకత స్పష్టమవుతుందని అన్నారు.

బీసీల్లో రెండవ స్థానంలో ఉన్న అగ్నికుల క్షత్రియులకు పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని నాయకులు కోరారు. తమ సామాజికవర్గానికి రాజకీయంగా సముచిత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
మత్స్యకారులంతా వైసీపీ వెంటే ఉన్నారని నాయకులు స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడంతో పాటు, 2029 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ విజయానికి అగ్నికుల క్షత్రియులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా వైసీపీ మత్స్యకార నాయకులు, అగ్నికుల క్షత్రియుల నాయకులు, పార్టీ కార్యకర్తలు, వివిధ ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్నారు.