BREAKING
28వ వార్డు కౌన్సిలర్‌గా పచ్చిపాల రామకృష్ణ ఆచారి ప్రమాణం : అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జహా,చైర్మన్ శ్రీరామ్ చినబాబు : శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు,వార్డు ప్రజలు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా..? టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య విధ్వంసం.. నవంబర్ 25 నుండి అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం: జిల్లా ఎస్పీ రేపటి నుంచి 'నషా ముక్త్ భారత్' పాదయాత్ర.. పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత డైరీలో సంచలన విషయాలు మళ్లీ రాబోతున్న 'గోల్డ్ స్పాట్'.. ఘన్గాపూర్‌లో పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఈ నెల 30 వ వరకు ఓటర్ల జాబితా సవరణకు గడువు. వైద్య చికిత్సకు రూ.50 వేల ఎల్ఓసీ మంజూరు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నైరుతి యెమెన్‌లో సౌదీ వైమానిక దాడులు యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం పత్తికొండలో పంచాయతీ నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత కార్తిక పౌర్ణమి వేళ పుణ్యస్నానాలు.. గంగా, యమునా ఘాట్‌లకు పోటెత్తిన భక్తులు సత్తాచాటిన మదనపల్లి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు : 10వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ : హర్షం వ్యక్తం చేసిన కోచ్ మురళి

నవంబర్ 25 నుండి అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం: జిల్లా ఎస్పీ

Select Suryaa Now
నవంబర్ 25 నుండి అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం: జిల్లా ఎస్పీ

సూర్య జగిత్యాల ప్రతినిధి: వేలాది మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఊరటనిస్తూ, అసలు అగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ, నమోదు ప్రక్రియను నవంబర్ 25 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలంగాణ నేర పరిశోధన విభాగం తెలిపింది. అందులో భాగంగా జగిత్యాల జిల్లాకు సంబంధించిన బాధితుల కోసం కరీంనగర్ లో ఈ ప్రక్రియ జరగనున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.  బాధితులకు త్వరితగతిన న్యాయం ఉపశమనం కల్పించే లక్ష్యంతో నిర్దేశిత కేంద్రాలలో పని దినాలలో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల బాధితుల కోసం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అల్కాపురి కాలనీ, కరీంనగర్ - సిరిసిల్ల బైపాస్ రోడ్డు, డీర్ పార్క్ పక్కన, ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో గల సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ప్రత్యేక ధృవీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కరీంనగర్ లో ధృవీకరణ కేంద్రంలో నవంబర్ 25 నుండి ఫిబ్రవరి 2, 2027 వరకు దశలవారీగా మండలాల వారీ షెడ్యూల్ ప్రకారం ధృవీకరణ ప్రక్రియ జరుగుతుందని, ప్రతి పని దినాన గరిష్టంగా 250 ఖాతాలను పరిశీలిస్తారని  తెలిపారు. ఈ షెడ్యూల్ ప్రకారం జగిత్యాల జిల్లా కి సంబంధించిన మండలాలు నవంబర్ 25 నుండి ప్రారంభం అవుతాయన్నారు.