BREAKING
ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు చీరాలలో చిరుజల్లులు.. మారిన వాతావరణం మూడో రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ పర్యటన ఉప్పులూరు అభివృద్ధికి మంచం గుర్తుపై ఓటేయండి డిసెంబర్ 27 న కరీంనగర్ లో జరిగే ఉప సర్పంచ్,వార్డు సభ్యుల బహిరంగ సభ ను జయప్రదం చేయండి..ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఎంపీడీవో పనితీరుతో ఇబ్బందుల్లో ఉద్యోగులు కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ నాగరాజు దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రత్యేక పూజలు ప్రజలందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు. నూతన ఎస్సై స్వరూప రాజ్ కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ బంధనకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు డాక్టర్ గొట్టిపాటిలక్ష్మి. రూపేష్ గుప్తాకు గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఘనంగా 21 హనుమాన్ చాలీసా పారాయణం అనాధ,నిరుపేద విద్యార్థులకు, అమ్మ జ్యోతి ఫౌండేషన్ అండ.

డిసెంబర్ 27 న కరీంనగర్ లో జరిగే ఉప సర్పంచ్,వార్డు సభ్యుల బహిరంగ సభ ను జయప్రదం చేయండి..ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్

Select Suryaa Now
డిసెంబర్ 27 న కరీంనగర్ లో జరిగే ఉప సర్పంచ్,వార్డు సభ్యుల బహిరంగ సభ ను జయప్రదం చేయండి..ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్

 


సూర్య బోయినపల్లి..
తెలంగాణ రాష్ట్రంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 27న భారీ బహిరంగ సభ కరీంనగర్ జిల్లా కేంద్రం లో సర్కస్ గ్రౌండ్ ( జ్యోతి రావు పూలే మైదానం ) నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉపసర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ తెలిపారు. ఉప సర్పంచ్ ల ఫోరమ్ బోయిన్ పల్లి మండల అధ్యక్షులు మిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ పోస్టర్  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కు  హాజరైన ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్, వార్డు సభ్యుల సంఘం  రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది అతికం రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉపసర్పంచ్ లకు 5000 వేలు ,వార్డు సభ్యులకు 3000  గౌరవ వేతనాలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలలో అభివృద్ధి శిలాఫలకాలలో ఉపసర్పంచ్, వార్డు సభ్యుల పేర్లను చేర్చాలని ఇతర రాష్ట్రాలలో అమలుపరుస్తున్న వేతన చట్టాన్ని ఇక్కడ అమలు పరచాలని హెల్త్ కార్డు ,జీవిత బీమా కల్పించాలని పేర్కొన్నారు. ఉప సర్పంచ్ ల చెక్ పవర్ ను రద్దు చేయవద్దు అని, ఉప సర్పంచ్ ల పదవీకాలం ఐదు సంవత్సరాలు పూర్తిస్థాయిలో ఉండే విధంగా చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఉప సర్పంచ్ లు , వార్డు సభ్యులు ప్రతి ఒక్కరూ డిసెంబర్ 27న జరిగే కరీంనగర్ భారీ బహిరంగ సభ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్, వార్డు సభ్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది అతికం రాజశేఖర్ గౌడ్,బోయిన్ పల్లి మండల అధ్యక్షులు మిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి ఎడపల్లి తిరుపతి,ఉపాధ్యక్షులు కల్లేపల్లి చంద్రయ్య, వార్డు సభ్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రగిరి వెంకటేష్, రాష్ట్ర సలహా దారు గంగాధర వెంకటరమణ , రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల సాంబయ్య గౌడ్,ఉప సర్పంచ్ ల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు  వెంకటేష్  నాయకులు మెరుపుల చందన జలంధర్ గౌడ్,ఎర్రగడ్డం స్వామి రెడ్డి, గొడిసెల  తిరుపతి, బాలగోని గోపాల్,చిలువేరి కిషన్ , చంద్రగిరి అశోక్,తంగళ్ళ పల్లి ప్రవీణ్, మనోహర్, గోపాల్ ,యోహాను బాబు, వార్డు సభ్యుల నాయకులు మెరుపుల సంగీత గంగాధర్ గౌడ్,శ్రీధర్,నరేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.