BREAKING
ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు చీరాలలో చిరుజల్లులు.. మారిన వాతావరణం మూడో రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ పర్యటన ఉప్పులూరు అభివృద్ధికి మంచం గుర్తుపై ఓటేయండి డిసెంబర్ 27 న కరీంనగర్ లో జరిగే ఉప సర్పంచ్,వార్డు సభ్యుల బహిరంగ సభ ను జయప్రదం చేయండి..ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఎంపీడీవో పనితీరుతో ఇబ్బందుల్లో ఉద్యోగులు కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ నాగరాజు దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రత్యేక పూజలు ప్రజలందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు. నూతన ఎస్సై స్వరూప రాజ్ కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ బంధనకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు డాక్టర్ గొట్టిపాటిలక్ష్మి. రూపేష్ గుప్తాకు గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఘనంగా 21 హనుమాన్ చాలీసా పారాయణం అనాధ,నిరుపేద విద్యార్థులకు, అమ్మ జ్యోతి ఫౌండేషన్ అండ.

ఎంపీడీవో పనితీరుతో ఇబ్బందుల్లో ఉద్యోగులు

Select Suryaa Now
ఎంపీడీవో పనితీరుతో ఇబ్బందుల్లో ఉద్యోగులు

ఎంపీడీవో పనితీరుతో ఇబ్బందుల్లో ఉద్యోగులు.

పోలింగ్ బూతులు మెయింటెనెన్స్  ఇవ్వకపోవడంతో ఇబ్బందుల్లో ఉద్యోగులు.

ఎన్నికల విధులు నిర్వర్తించిన సిబ్బందికి ఇవ్వని నగదు.

జిల్లా అధికారుల నుండి గతం లో  అక్షింతలు పడిన మారని ఎంపీడీవో పనితీరు.

సూర్య న్యూస్ ముండ్లమూరు. ముండ్లమూరు ఎంపీడీవో తన ఇష్టానుసారం వ్యవహరిస్తూ  అధికారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి.  ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మెయింటినెన్స్ ఖర్చులు ను ప్రభుత్వం అందజేస్తుంది. పోలింగ్ మెయింటెనెన్స్ ఖర్చులు ఇవ్వకుండా కింది స్థాయి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తుంది. మండలంలో మొత్తం 56 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక పోలింగ్ కేంద్రం మెయింటెనెన్స్ కు ప్రభుత్వం పదివేల రూపాయలు మంజూరు చేసింది. ఆ నిధులతో పోలింగ్ చేస్తున్న వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు పైనే ఉంది. గ్రామపంచాయతీ కార్యదర్శులు తమ సొంత డబ్బులు పెట్టుకుని పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు వసతులు ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయి కౌంటింగ్ పూర్తయినప్పటికీ ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ ఖర్చులు ఎంపీడీవో అందజేయలేదు. అంతేకాకుండా ఎన్నికల విధులు నిర్వర్తించిన సిబ్బందికి కూడా ఇవ్వవలసిన నగదు ఇవ్వలేదు. బ్యాలెట్ బాక్స్ లు పంపిణీ కౌంటింగ్ డ్యూటీ ఎలక్షన్ డ్యూటీ, పోలింగ్ బాక్స్ రిసీవింగ్ డ్యూటీ చేసిన సిబ్బంది కి కూడా నగదు నేటికీ అందజేయలేదు. జడ్పిటిసి ఎన్నికల విధులు నిర్వర్తించిన పంచాయతీ కార్యదర్శులకు సచివాలయం సిబ్బందికి ఇవ్వవలసిన నగదు ఇవ్వకపోవడంతో  కిందిస్థాయి సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. గత ఎన్నికల విధులు నిర్వర్తించిన సిబ్బందికి మెయింటినెన్స్ ఇవ్వకపోగా పంచాయితీ ఎన్నికలకు కూడా మీరే మెయింటెనెన్స్ ఖర్చులు పెట్టుకోవాలని ఎంపీడీవో హుకం జారీ చేశారు.వారం రోజుల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దానికి అయ్యే ఖర్చులు ఎక్కడ తెచ్చి పెట్టాలనే ఆలోచనలో సిబ్బంది ఉన్నారు. కొంతమంది కిందిస్థాయి సిబ్బంది అప్పులు చేసి ఎన్నికల విధులను నిర్వర్తించారు. ఎంపీడీవో పనితీరుతో కింది స్థాయి సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో జిల్లా స్థాయి అధికారులు ఎంపీడీవోకు అక్షింతలు వేసిన ఆమె పనితీరులో మాత్రం ఏ మాత్రం మార్పు లేదని పలువురు సిబ్బంది బహిరంగంగానే అంటున్నారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేసి సిబ్బందిని ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.