ఘనంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు జన్మదిన వేడుకలు
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న ఎమ్మెల్యే
వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్......
ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మేయర్ భార్గవి డిప్యూటీ మేయర్ రజిని --- సేవే పరమావధి ..... రక్తదానం ప్రాణదానం.... ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ---
విజయనగరం బ్యూరో మేజర్ న్యూస్ : విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పుట్టినరోజు వేడుకలు అశోక్ బంగ్లా లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు.
అందులో భాగంగానే విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ముందుగా వేద పండితులతో ఆశీర్వచనాలు అందుకున్న అనంతరం బంగ్లాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతల తో మాట్లాడుతూ ఎంతోమందికి ఇలాంటి కార్యక్రమాలు ఆదర్శనీయమని కొనియాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు .ఈ రక్త సేకరణ అత్యవసర పరిస్థితుల్లో ఎన్నో ప్రాణాలను కాపాడుతుందని అన్నారు గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయంలోను ప్రమాదాల సమయంలోనూ ఈ రక్త నిలువలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రక్తం నిలువలు ఉంటే ఎంతో సంపద సృష్టించుకున్నట్లు అన్నారు.ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కోరారు. అనంతరం కేక్ ను కట్ చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ అవనాపు భార్గవి, డిప్యూటీ మేయర్ ప్రసాదుల రజిని, మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల కనకమహాలక్ష్మి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.పట్టణ టిడిపి పార్టీ అధ్యక్షులు గంటా రవి మండల పార్టీ అధ్యక్షులు ఘంటా పోలినాయుడు ఎంపీపీ కోరాడ తులసి వైస్ ఎంపీపీ సుంకరి కళ్యాణదేవి, అవనాపు విజయ్ , రాజేష్ వర్మ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పుస్తకాలు పూల మొక్కలు ఇచ్చి శాలువాలతో సత్కరించారు. ఈ రక్తదాన శిబిరంలో ఇండియన్ రెడ్ క్రాస్, ఎన్ వి ఎన్, మిమ్స్, ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఎలా అనేక కొత్త సంస్థలు రక్త నిధులను సేకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు, మండల ఎంపిటిసి, నాయకులు, కార్యకర్తలు ,మహారాజా స్కూల్స్, కాలేజీలు స్టాప్, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.