BREAKING
కొండగట్టుకు భక్తుల రద్దీ.. కార్తీక పౌర్ణమి కి భక్తుల తాకిడి. బాంబు బెదిరింపు మెయిల్ కేసులో కీలక పురోగతి..నిందితుల కోసం గాలింపు ముమ్మరం ఆలయాల్లో హరనామస్మరణ...... ఘనంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు జన్మదిన వేడుకలు కార్తిక దామోదర ప్రీత్యర్థం.....(ఆథ్యాత్మికం) ప్రైవేట్ పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ తప్పనిసరి *TRSMA ఫేజ్-2 జనరల్ బాడీ సమావేశంలో ఫైర్ సేఫ్టీ అధికారి యాదగిరి* బఫలో కాల్పుల ఘటనకు సోషల్ మీడియా సంస్థలు బాధ్యులు కావు ఇంధన సామర్థ్య చర్యలతో 120 బిలియన్ యూరోలు ఆదా స్పేస్ఎక్స్-టెస్లా విలీన చర్చలకు ఐదుగురు డైరెక్టర్ల బాధ్యత సైనిక బలోపేతంలో జపాన్ వాహన సరఫరాదారుల కొత్త మలుపు ఐరోపాలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు అమెరికా చిప్ ఆంక్షలతో చైనాతో సంబంధాలకు ఎలాంటి ఇబ్బంది లేదు చైనాతో భద్రతా ఒప్పందానికి బదులుగా ఆస్ట్రేలియాతో కొత్త ఒప్పందం ఇథియోపియాలోని టైగ్రే పట్టణంపై ఫిరంగి దాడులు మయన్మార్ శరణార్థుల స్వదేశానికి తరలింపుపై మలేసియా కొనసాగింపు

ఆలయాల్లో హరనామస్మరణ......

Select Suryaa Now
ఆలయాల్లో హరనామస్మరణ......

సూర్య బెజ్జుర్ :కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో బెజ్జూర్ కౌటాల చింతలమానేపల్లి తదితర మండలాలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు హనుమాన్ ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడాయి.బెజ్జూర్ రంగనాయకస్వామి ఆలయం చింతలమానేపల్లి మండలం రుద్రపూర్ ఆలయం డబ్బా అభయ ఆంజనేయ స్వామి ఆలయం కౌటాల శివాలయంతెల్లవారుజామున నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పరమశివుడిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయాల్లో శివనామ స్మరణలు, భక్తుల జయజయధ్వానాలతో పలు శైవక్షేత్రాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో దీపాలు వెలిగించి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తూ స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో ఆలయాలకు చేరుకున్న భక్తులు పరమశివుడిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో సందడిగా మారడంతో సిర్పూర్ నియోజక వర్గంలో ప్రాంతమంతా శివనామ స్మరణతో భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.