కార్తిక దామోదర ప్రీత్యర్థం.....(ఆథ్యాత్మికం)
కార్తిక దామోదర ప్రీత్యర్థం.....(ఆథ్యాత్మికం)
రచన ::- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు.
పశ్చిమగోదావరి జిల్లా.. సెల్ ::- 8247433432
హరోం హరా అంటూ కదులుదాం రండీ
శివ శివ శంభో శంకరా అంటూ వేడుకుందాం రండీ
మాసానాం కార్తికం శ్రేష్ఠమన్న మాట మరువకండీ
సూర్యోదయాత్పూర్వమే స్నానం చేయంగ రండీ
తోయమో పత్రమో భక్తితో శివయ్యకు అర్పించగరండీ
ఫలమో పుష్పమో నిష్టతో ముక్కంటికి నివేదించగరండీ
ఏకభుక్తం, ఉపవాసం, శివదర్శనం ముఖ్యమని మరువకండీ
ఉసిరి, తులసీ, గోమాతలను సాముహికంగా పూజిచంగ రండి
సాత్వికాహారం, వనభోజనం, సహపంక్తి భోజనం చేయంగ రండి
పున్నమి కాంతుల్లో జ్వాలాతోరణా సంబరాలు చేయంగ రారండీ
గరళకంఠునికి లక్ష బిళ్వార్చన శాస్త్రోక్తంగా చేయంగ కలిసి రండి
కైలాసాన పరవశించే శివయ్యను మనసారా సేవించంగ రారండో
శివయ్యే నీతోడుంటే అన్నీ విజయాలు నీవెంటెనని మరువకండీ
శివానుగ్రహానికై నిరంతమూ శివనామము మననం చేయండీ
పంచభూతాల మిళితమైన ఈ దేహముక్తికై శరణు కోరండీ
మోక్షప్రాప్తికై పంచప్రాణాలను ఆదిదంపతులపైనిడి సేవించంగ రండీ…
కార్తీకంలో చేయవలసినవి:
1. తుమ్మిపూలతో శివుడిని, అవిసె పూలతో విష్ణుమూర్తిని పూజించాలి.
2. కార్తీక మాసంలో గృహ నిర్మాణాన్ని ప్రారంభించినచో ధన, ధాన్య లాభం చేకూరుతుందని మత్స్యపురాణం చెబుతున్నది.
3. వేకువ జామున చేసిన స్నానం పాపాలను నశింపజేస్తుంది.
4. ఈ మాసంలో ఏ మానవుడు ఇతరుల ఆహారాన్ని స్వీకరించడో అతడు (మొదటి రోజు నిరాహారంగా ఉండి, మరుసటిరోజు పంచ గవ్యమును సేవించి ఉండే ఉపవాసాన్ని కృచ్ఛవ్రతం అంటారు) కృచ్ఛ వ్రతం యొక్క ఫలాన్ని పొందుతాడు.
5. చంద్ర, సూర్య గ్రహణాల కాలంలో బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల వచ్చే ఫలం కార్తీకమాసంలో నేలపై శయనించినచో కలుగుతుంది..
6. నువ్వుల దానం, నదీ స్నానం, సదా సాధు పురుషుల సేవ , మోదుగ ఆకులతో కుట్టిన విస్తర్లలో భోజనం కార్తీకంలో చేసిన మోక్షం కలుగుతుంది.
7. మౌనవ్రతం పాటించడం, నువ్వులు కలిపిన నీటితో స్నానం, సదా క్షమా గుణాన్ని కలిగి ఉండడం, నేలపై శయనించడం వల్ల యుగయుగాలలో చేసిన పాపాలన్నీ నాశ నమవుతాయి.
8. బ్రాహ్మణులు కంచుపాత్రలో భోజనం చేయకూడదు.
9. మాంసాహారాన్ని, క్షుర కర్మను, తేనెను, రెండవసారి భోజనాన్ని, ప్రత్యేకించి మైధునాన్ని ఏ బ్రాహ్మణుడు విడిచి పెడతాడో అతడు చాతుర్మాస వ్రత ఫలాన్ని పొందుతాడు.
10. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం దర్శనం చే సుకోవాలి
11.కార్తీక పురాణం రోజుకో అధ్యాయం చదవాలి.
12. శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం, శ్రీమద్భగవద్గీత, ఇలా శివ కేశవులకు సంబంధించిన పురాణాలు, కథలు చదువుకోవాలి.
13. ఎక్కువ సేపు ఆథ్యాత్మిక, ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలి.
14. సాధ్యమైనంతవరకూ నదీ తీర్థాలలో స్నానాలు, పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవాలి.
15. విశేషించి ఫలమో, పత్రమో, తోయమో, పుష్పమో, భగవంతునికి అర్పించాలి.
16. అదే విధంగా మనకున్న దానిలో తృణమో, పణమో, పరమేశ్వారార్పణమస్తు అంటూ ఇతరులకు దానమివ్వాలి.
కార్తీకంలో చేయకూడని పనులు:
1. ఇంటివద్ద స్నానం చేయకూడదు
2. వేడినీళ్లు అసలు స్నానం చేయకూడదు
3. సూర్యోదయం అయినాక స్నానం చేయకూడదు.
4. నీరుల్లి, వెల్లుల్లి, మాంసాహారాలు వాడకూడదు.
5. నాగుల చవితి నాడు నేలను తవ్వకూడదు. బొరియలు పూడ్చకూడదు. చెట్టూ, పుట్టా కొట్టకూడదు.
6. పగలు నిద్రపోకూడదు.
7. తలంటు స్నానం చేయకూడదు.
8. దేవతలను, బ్రాహ్మణులను నిందించకూడదు.
కార్తీకంలో ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమాలను కూడా తెలుసుకుందాం.
1)స్నానం : కార్తీక మాసంలో ప్రతిరోజూ సూర్యోదయాని కి పూర్వమే స్నానం చేయాలి. నదులలో, కాల్వల్లో, చెరువుల్లో, ఎక్కడైనా స్నానం చేయొచ్చు. ఈ మాసంలో విష్ణువు నదులలో, కాల్వల్లో, చెరువుల్లో, పిల్ల కాల్వ, దిగుడు బావులలో నివశిస్తాడు. కనుకనే ఈ మాసంలో వాపి, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం చేసే నీటిలోనే గంగ, యమున, నర్మద, సరస్వతి, కావేరి, గోదావరి, కృష్ణ వంటి నీరు ఉందని భావించుకుంటూ ఆయా నదులను స్మరిస్తూ స్నానం చేయాలి. వేడినీళ్లు స్నానం చేయకూడదు. నదీ స్నానం ఎంతో పవిత్రం. సముద్ర స్నానం ఉత్తమం. నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుందంటారు పెద్దలు.
‘నమో దేవి! మహా గంగే మహా పుణ్య జలైర్యాతే స్నాతుమిచ్ఛామి దేవేశి ప్రసీద పరమేశ్వరి’
పవిత్రమైన జలాలలో కూడిన మహాగంగా నేను ఈ నదిలో స్నానం చేస్తున్నాను. దేవేశీ! పరమేశ్వరీ! నాకు ప్రసన్నురావిగావల్సిందంటూ ప్రార్ధిస్తూ స్నానం చేయాలి.
2) ఆహారం, ఉపవాసం: కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం వుండి
మడిగా వంట చేసుకుని, నక్షత్ర దర్శనం చేసుకుని స్వామి వారికి నివేదించిన తర్వాత భోజనం చేయాలి. అలా చేసిన భోజనాన్ని 'నక్తము' అంటారు. పగలంతా ఉపవాసం చేయలేని వారు పండ్లు, పాలు తీసుకోవచ్చు. నిత్యమూ గృహస్థులు ఉపవాసం చేయకూడదు. సంతానం ఉన్నవారు పూర్తిగా నిరాహారులుగా ఉండకూడదు. కార్తీక మాసమంతా ఉపవాసం ఉండలేని వారు కనీసం సో మవారం, పౌర్ణమి, ఏకాదశి, మాస శివరాత్రి రోజులలో అయినా ఉపవాసం ఉండాలి. కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు, మాంసాహారాలు, ఉన్మాదకాలు తినకూడదు. శాకాహారాన్ని, సాత్త్వికాహారాన్ని మితంగా తీసుకోవాలి. అప్పుడే మనలో సత్ప్రవర్తన కలుగుతుంది. కార్తీకంలో పనస ఆకులతో, మోదుగ ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేయడం చాలా మంచిది. తేనె, రేగుపండ్లు, నల్ల ఆవాలు, ఉన్మాదకాలు, మాంసాహారం, అవిసె నూనె, నువ్వుల నూనె, వంకాయ, పులుపు చారు, సొరకాయ, గుమ్మడికాయ తినకూడదు. ఈ మాసంలో పలు రాకల చెట్లున్న వనంలో ఉసిరిక చెట్టు కింద కూర్చొని భోజనం చేయాలి. అలా తిన్నవారికి సంవత్సర కాలం నాటి అన్న సంసర్గ జనిత దోషం (ఎంగిలి లేదా అశుద్ధమైన ఆహారాన్ని తినడం వల్ల కలిగే దోషం) నశిస్తుంది. ఎవరైతే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజూ విస్తరాకులలో భుజిస్తారో వారు 14 ఇంద్రుల యొక్క ఆయువు పర్యంతం ఎన్నడూ దుర్గతిలో పడరు. వారి కోరికలన్నీ నెరవేరి, సమస్త పుణ్య తీర్థాల ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. తప్పనిసరిగా బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టాలి
3) వన భోజనం : కార్తీక మాసంలో తప్పనిసరిగా చేయాల్సినది వనభోజనం. ఎప్పుడూ రణగొణ ధ్వనులతో నిండి ఉండే గ్రామ, పట్టణ ప్రదేశాలను విడిచి ఏ విధమైన ధ్వనులు లేని ప్రశాంతమైన బహిరంగ ప్రదేశంలో స్వచ్ఛమైన ప్రాణ వాయువులు లభించే పలు జాతులున్న చెట్లు గల ఉసిరిక చెట్టు కింద అందరూ కలిసి భోజనం చేయాలి. ఉసిరిక చెట్టు కింద సాలగ్రామం లేదా దేవుడి పటం ఉంచి పూజించి శ్రీ మహావిష్ణువును గానీ, పరమేశ్వరుని గాని పూజించాలి. ఉసిరి చెట్టుకు తొమ్మిదిసార్లు ప్రదక్షిణం చే యాలి. బంధుమిత్రులందరితో కలిసి సాత్వికాహారాన్ని మాత్రమే భుజించాలి. రెండవ మారు ఏ పదార్ధాన్ని వడ్డించుకో కూడదు. కార్తిక మాసంలో వనభోజనం చేసిన వారికి అశ్వమేథ యాగం చేసినంత ఫలం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి.
4) తులసీపూజ: కార్తీకంలో తప్పనిసరిగా చేయాల్సిన పూజ తులసీపూజ.
తులసి మొక్క సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారమని పురాణాలు చెబుతున్నాయి. భగవంతుని ప్రసాదమైన తులసి ఆకులను నోటిలో, తలపై, శరీరంపైనా సంతోషంగా ఎవరు ధరిస్తారో వారికి కలి ప్రభావం అంటదు. కాశీలో మరణించడం, వేదాధ్యయనం చేయడం, ప్రయాగలో స్నానం చేయడం వల్ల ఏ ఫలం లభిస్తుందో అదంతా తులసిని పూజించడం వల్ల లభిస్తుంది. ద్వాదశి రోజున తులసి ఆకులను, కార్తీక మాసంలో ఉసిరి ఆకులను ఎవరు తెంపుతారో వారు అత్యంత ఘోర నిందిత నరకాలలో పడతారు. శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో ద్వాదశి రోజు న తులసీ (బృందా) వనానికి వస్తాడని నమ్మకం. సూర్యాస్తమయం తర్వాత స్త్రీలు తులసి మొక్క వద్ద శ్రీ విష్ణుమూర్తి పటాన్ని గానీ, విగ్రహా న్ని గానీ ఉంచి ఆచరించే వ్రతం వల్ల సౌభాగ్య సిద్ధి కలిగి, సుఖ సంపదలు కలుగుతాయి. దేవతార్చనకు తులసీదళం అతి శ్రేష్ఠ మైనది. తులసికోట వద్ద చిలుకు ద్వాదశి రోజున కర్ర పాతి ఆకాశదీపం వెలిగించాలి. కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు పౌర్ణమి వరకూ తుల సీ కళ్యాణం జరపాలని స్మృతి కౌస్తుభం చెబుతున్నది. తులసీ కళ్యాణానికి దేవ దీపావళి అని పేరు.ఆ రోజు దీపాలను ప్రమిదల్లో ఉంచి ఇంటి నిండా వెలిగించాలి. శ్రీకృష్ణుడు సత్యభామతో నారదుడు ఆచరింపజేసిన వ్రతం ఇదే.
శ్రేష్ఠమైన పరమ పవిత్రమైన ఈ కార్తిక మాసంలో చిత్తం శివయ్య మీద వుంచి భక్త్యానుసారం మనస్పూర్తిగా ఓపిక వున్న వారలందరూ కాలామానపరిస్థితుల శారీరక ఆరోగ్య మానసిక స్థితిగతుల దృష్ట్యా కార్తికంలో మహాదేవుడిని ఆరాధించి శివానుగ్రహం పొందగలరు.
అంతా శివమయం...ఈ జగమంతా శివం సత్యం సుందరం..…
రచన ::- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు.
పశ్చిమగోదావరి జిల్లా.. సెల్ ::- 824743343