ప్రైవేట్ పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ తప్పనిసరి *TRSMA ఫేజ్-2 జనరల్ బాడీ సమావేశంలో ఫైర్ సేఫ్టీ అధికారి యాదగిరి*
ప్రైవేట్ పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ తప్పనిసరి
*TRSMA ఫేజ్-2 జనరల్ బాడీ సమావేశంలో ఫైర్ సేఫ్టీ అధికారి యాదగిరి*
*మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:*
మిర్యాలగూడ పట్టణంలోని కార్నర్ స్టోన్ హైస్కూల్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు TRSMA ఫేజ్-2 జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మిర్యాలగూడ ఫైర్ సేఫ్టీ అధికారి యాదగిరి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల భవనాలకు ప్రభుత్వం నిర్దేశించిన ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ముఖ్యంగా జి+2 అంతస్తులు కలిగిన పాఠశాల భవనాలకు ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ఎన్‌ఓసీ పొందాలని కోరారు. ప్రభుత్వం ఫైర్ సేఫ్టీ అనుమతుల ప్రక్రియను సులభతరం చేసిందని, పాఠశాలల యాజమాన్యాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
అదేవిధంగా నెక్స్ట్ జెన్ ఐఐటీ, జేఈఈ మెయిన్స్ చైర్మన్ డాక్టర్ కోటేశ్వరరావు 10+2 విద్యావిధానం, ప్రభుత్వ నిబంధనలు, విద్యా రంగంలో వస్తున్న మార్పులపై వివరించారు.
ఈ కార్యక్రమంలో TRSMA రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ కవచం నాగరాజు, మిర్యాలగూడ TRSMA ఫేజ్-2 అధ్యక్షుడు కందుల మధుసూదన్ రెడ్డి, సోమగాని శ్రీనివాస్, దోమల రాంరెడ్డి, లిటిల్ రాకెట్ స్కూల్ శ్రీనివాస్, వెంకటేష్, లిటిల్ ఆర్ట్స్ రాంబాబు, ఎస్‌పీఆర్ స్కూల్ శ్రీనివాస్ రెడ్డి, కార్నర్ స్టోన్ ప్రిన్సిపాల్, అశోక్, హైమద్, జమీల్, ఉపేందర్, మార్టిన్ తదితర పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.