BREAKING
రూపేష్ గుప్తాకు గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఘనంగా 21 హనుమాన్ చాలీసా పారాయణం అనాధ,నిరుపేద విద్యార్థులకు, అమ్మ జ్యోతి ఫౌండేషన్ అండ. ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి విశేష స్పందన కొండగట్టుకు భక్తుల రద్దీ.. కార్తీక పౌర్ణమి కి భక్తుల తాకిడి. బాంబు బెదిరింపు మెయిల్ కేసులో కీలక పురోగతి..నిందితుల కోసం గాలింపు ముమ్మరం ఆలయాల్లో హరనామస్మరణ...... ఘనంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు జన్మదిన వేడుకలు కార్తిక దామోదర ప్రీత్యర్థం.....(ఆథ్యాత్మికం) ప్రైవేట్ పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ తప్పనిసరి *TRSMA ఫేజ్-2 జనరల్ బాడీ సమావేశంలో ఫైర్ సేఫ్టీ అధికారి యాదగిరి* బఫలో కాల్పుల ఘటనకు సోషల్ మీడియా సంస్థలు బాధ్యులు కావు ఇంధన సామర్థ్య చర్యలతో 120 బిలియన్ యూరోలు ఆదా స్పేస్ఎక్స్-టెస్లా విలీన చర్చలకు ఐదుగురు డైరెక్టర్ల బాధ్యత సైనిక బలోపేతంలో జపాన్ వాహన సరఫరాదారుల కొత్త మలుపు ఐరోపాలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు

రూపేష్ గుప్తాకు గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు

Select Suryaa Now
రూపేష్ గుప్తాకు గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు

నరసరావుపేట : మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నాగసరపు రూపేష్ గుప్తాకు గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపం లో సోమవారం మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సంఘ సభ్యులు ఈ మేరకు తమ మద్దతు తెలిపారు. రూపేష్ గుప్తాకు 20 వేలకుపైగా మెజార్టీ సాధించేలా కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, వాగ్దేవి విద్యాసంస్థల డైరెక్టర్ రాయల శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అవసరమని పేర్కొంటూ రూపేష్ గుప్తాకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే అరవింద బాబు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూపేష్ గుప్తాకు అవకాశం కల్పించామని తెలిపారు. రాయల శ్రీనివాసరావు పట్టణ అభివృద్ధి కొనసాగేందుకు ఆయనకు మద్దతు ప్రకటించారు. మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా తన కుమారుడు మరింత మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. రూపేష్ గుప్తా మాట్లాడుతూ పెద్దల ఆశీర్వాదం, ప్రజల మద్దతుతో విజయం సాధించి నరసరావుపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనకు మద్దతు ప్రకటించిన నాయకులకు, గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి