BREAKING
రూపేష్ గుప్తాకు గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఘనంగా 21 హనుమాన్ చాలీసా పారాయణం అనాధ,నిరుపేద విద్యార్థులకు, అమ్మ జ్యోతి ఫౌండేషన్ అండ. ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి విశేష స్పందన కొండగట్టుకు భక్తుల రద్దీ.. కార్తీక పౌర్ణమి కి భక్తుల తాకిడి. బాంబు బెదిరింపు మెయిల్ కేసులో కీలక పురోగతి..నిందితుల కోసం గాలింపు ముమ్మరం ఆలయాల్లో హరనామస్మరణ...... ఘనంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు జన్మదిన వేడుకలు కార్తిక దామోదర ప్రీత్యర్థం.....(ఆథ్యాత్మికం) ప్రైవేట్ పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ తప్పనిసరి *TRSMA ఫేజ్-2 జనరల్ బాడీ సమావేశంలో ఫైర్ సేఫ్టీ అధికారి యాదగిరి* బఫలో కాల్పుల ఘటనకు సోషల్ మీడియా సంస్థలు బాధ్యులు కావు ఇంధన సామర్థ్య చర్యలతో 120 బిలియన్ యూరోలు ఆదా స్పేస్ఎక్స్-టెస్లా విలీన చర్చలకు ఐదుగురు డైరెక్టర్ల బాధ్యత సైనిక బలోపేతంలో జపాన్ వాహన సరఫరాదారుల కొత్త మలుపు ఐరోపాలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు

అనాధ,నిరుపేద విద్యార్థులకు, అమ్మ జ్యోతి ఫౌండేషన్ అండ.

Select Suryaa Now
 అనాధ,నిరుపేద విద్యార్థులకు, అమ్మ జ్యోతి ఫౌండేషన్ అండ.

తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలు, ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమవుతున్న నిరుపేద విద్యార్థులకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ అమ్మ జ్యోతి ఫౌండేషన్ అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో విద్యార్థుల విద్యాభ్యాసం, వసతి, భోజనం తదితర బాధ్యతలను స్వీకరించేందుకు సంస్థ ముందుకు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన పిల్లలతో పాటు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయిన పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసించేందుకు అవసరమైన సహాయాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పాఠశాల ఫీజులు, కళాశాల ఫీజులు, వసతి గృహ ఫీజులు, భవన నిర్వహణకు సంబంధించిన ఫీజులు, భోజన ఖర్చులు ఉచితంగా అందించనున్నట్లు సంస్థ ప్రచార సమాచారంలో తెలిపింది. విద్యార్థులు ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రోత్సహించి, వారి భవిష్యత్తుకు బాటలు వేయడమే సంస్థ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. తల్లిదండ్రుల అండలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులకు విద్యతో పాటు భవిష్యత్తుపై నమ్మకం కల్పించడం ఎంతో అవసరమని, అలాంటి పిల్లలకు ఈ అవకాశం ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే నిలిపివేస్తున్న విద్యార్థులకు ఈ సమాచారం చేరవేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు, బంధువులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. అలాగే గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు తమ పరిధిలో చదువుకు దూరమవుతున్న అనాథ, నిరుపేద విద్యార్థులను గుర్తించి ఈ సమాచారం వారికి చేరవేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కరి ద్వారా అందిన సమాచారం కూడా ఒక విద్యార్థి జీవితానికి కొత్త దిశ చూపే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, ప్రవేశ ప్రక్రియ, ఇతర పూర్తి వివరాలను అమ్మ జ్యోతి ఫౌండేషన్ నిర్వాహకులను సంప్రదించి తెలుసుకోవచ్చు. వివరాల కోసం 9490043272, 9573411887 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మనకు అవసరం లేకపోయినా, తల్లిదండ్రుల అండలేక విద్య కోసం ఎదురుచూస్తున్న చిన్నారులకు ఈ అవకాశం ఎంతో విలువైనదై ఉండవచ్చు. అందుకే ఈ సమాచారాన్ని వాట్సాప్, సామాజిక మాధ్యమాలు, ఇతర గ్రూపుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి అర్హులైన విద్యార్థులకు చేరవేయాలని కోరుతున్నారు. పేద విద్యార్థులకు చేయూతనివ్వడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.