BREAKING
రూపేష్ గుప్తాకు గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ఘనంగా 21 హనుమాన్ చాలీసా పారాయణం అనాధ,నిరుపేద విద్యార్థులకు, అమ్మ జ్యోతి ఫౌండేషన్ అండ. ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి విశేష స్పందన కొండగట్టుకు భక్తుల రద్దీ.. కార్తీక పౌర్ణమి కి భక్తుల తాకిడి. బాంబు బెదిరింపు మెయిల్ కేసులో కీలక పురోగతి..నిందితుల కోసం గాలింపు ముమ్మరం ఆలయాల్లో హరనామస్మరణ...... ఘనంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు జన్మదిన వేడుకలు కార్తిక దామోదర ప్రీత్యర్థం.....(ఆథ్యాత్మికం) ప్రైవేట్ పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ తప్పనిసరి *TRSMA ఫేజ్-2 జనరల్ బాడీ సమావేశంలో ఫైర్ సేఫ్టీ అధికారి యాదగిరి* బఫలో కాల్పుల ఘటనకు సోషల్ మీడియా సంస్థలు బాధ్యులు కావు ఇంధన సామర్థ్య చర్యలతో 120 బిలియన్ యూరోలు ఆదా స్పేస్ఎక్స్-టెస్లా విలీన చర్చలకు ఐదుగురు డైరెక్టర్ల బాధ్యత సైనిక బలోపేతంలో జపాన్ వాహన సరఫరాదారుల కొత్త మలుపు ఐరోపాలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు

ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి విశేష స్పందన

Select Suryaa Now
ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి విశేష స్పందన

 

సూర్య, జన్నారం : జన్నారం మండలంలోని పొనకల్ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఐదు లక్షల జీవిత బీమా కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మ,  జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ ఫసియుల్లా, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం మోహన్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులైన కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఉచిత జీవిత బీమా పరిహారం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అప్పాల జలపతి, కార్యదర్శి రేగొండి రాహుల్, వార్డు సభ్యులు మల్లయ్య, రజాక్, రవీందర్, మోసిన్ షా, నాయకులు జక్కు భూమేష్,  గంగన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.