BREAKING
మళ్లీ రాబోతున్న 'గోల్డ్ స్పాట్'.. ఘన్గాపూర్‌లో పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఈ నెల 30 వ వరకు ఓటర్ల జాబితా సవరణకు గడువు. వైద్య చికిత్సకు రూ.50 వేల ఎల్ఓసీ మంజూరు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నైరుతి యెమెన్‌లో సౌదీ వైమానిక దాడులు యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం పత్తికొండలో పంచాయతీ నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత కార్తిక పౌర్ణమి వేళ పుణ్యస్నానాలు.. గంగా, యమునా ఘాట్‌లకు పోటెత్తిన భక్తులు సత్తాచాటిన మదనపల్లి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు : 10వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ : హర్షం వ్యక్తం చేసిన కోచ్ మురళి గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, శుభాకాంక్షలు భూభారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ మాదక ద్రవ్యాల పరిశీలన తెలంగాణ రక్షణ సేనలోకి గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన దాదాపు 30 మంది యువత చేరిక ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు చీరాలలో చిరుజల్లులు.. మారిన వాతావరణం

ఈ నెల 30 వ వరకు ఓటర్ల జాబితా సవరణకు గడువు.

Select Suryaa Now
ఈ నెల 30 వ వరకు ఓటర్ల జాబితా సవరణకు గడువు.

కళ్యాణదుర్గం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌)-2026లో భాగంగా ఓటర్ల జాబితా సవరణలు, అర్హులైన ఓటర్ల పేర్ల నమోదుకు నవంబర్ 30వ తేదీ వరకు గడువు ఉందని 154-కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి జి. వసంతబాబు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం. ఆంజనేయ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, గడువులు, అనుసరించాల్సిన విధానాలపై వారు వివరించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటర్ల జాబితాలో పేరు లేకుండా మిగిలిపోకూడదనే లక్ష్యంతో అదనపు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. జూలై 31వ తేదీన ప్రచురించిన ఎస్‌ఐఆర్‌-2026 ముసాయిదా ఓటర్ల జాబితాలో కొందరి పేర్లను గైర్హాజరు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, మరణించినవారు, ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదైనవారిగా గుర్తించినట్లు తెలిపారు. అటువంటి ఓటర్లు తమ అర్హతను నిరూపించుకుని తుది ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నవంబర్ 30వ తేదీ వరకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని, అనంతరం సంబంధిత వివరాలను పరిశీలించి అర్హత కలిగిన వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియలో అర్హత నిర్ధారణ అనంతరం సంబంధిత ఓటర్లకు గతంలో ఉన్న ఎపిక్‌ నంబర్‌నే కొనసాగించేలా చర్యలు చేపడతామని వివరించారు. డిసెంబర్ 22వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సమయంలో కొత్తగా ఓటరు నమోదుకు దరఖాస్తు సమర్పించిన వారు మరోసారి ఫారం-6 సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన సర్వేలో మొత్తం 22,664 మంది ఓటర్లను వివిధ కేటగిరీలుగా గుర్తించినట్లు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి జి. వసంతబాబు వెల్లడించారు. వీరిలో శాశ్వతంగా వలస వెళ్లినవారు 5,978 మంది, మరణించినవారు 7,503 మంది, రెండుసార్లు ఓటరుగా నమోదైనవారు 3,587 మంది, గైర్హాజరైనవారు 5,596 మంది ఉన్నట్లు వివరించారు. ఈ వివరాల ఆధారంగా అర్హులైన ఓటర్లను గుర్తించి జాబితాలో చేర్చేందుకు ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపడుతోందన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడు తన పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తమ పరిధిలోని ఓటర్లకు అవగాహన కల్పించి, అర్హులైన వారి పేర్లు జాబితాలో ఉండేలా సహకరించాలని కోరారు. నిర్ణీత గడువులోగా అవసరమైన ప్రక్రియను పూర్తి చేసుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ := బోయ రంగస్వామి.