BREAKING
గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, శుభాకాంక్షలు భూభారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ మాదక ద్రవ్యాల పరిశీలన తెలంగాణ రక్షణ సేనలోకి గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన దాదాపు 30 మంది యువత చేరిక ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు చీరాలలో చిరుజల్లులు.. మారిన వాతావరణం మూడో రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ పర్యటన ఉప్పులూరు అభివృద్ధికి మంచం గుర్తుపై ఓటేయండి డిసెంబర్ 27 న కరీంనగర్ లో జరిగే ఉప సర్పంచ్,వార్డు సభ్యుల బహిరంగ సభ ను జయప్రదం చేయండి..ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఎంపీడీవో పనితీరుతో ఇబ్బందుల్లో ఉద్యోగులు కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ నాగరాజు దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రత్యేక పూజలు ప్రజలందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు. నూతన ఎస్సై స్వరూప రాజ్ కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ బంధనకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

తెలంగాణ రక్షణ సేనలోకి గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన దాదాపు 30 మంది యువత చేరిక

Select Suryaa Now
తెలంగాణ రక్షణ సేనలోకి గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన దాదాపు 30 మంది యువత చేరిక

సూర్య  .. గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామంలో తెలంగాణ రక్షణ సేన పార్టీలోకి యువత పెద్ద సంఖ్యలో చేరారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ లక్ష్యాలకు ఆకర్షితులై గ్రామానికి చెందిన సుమారు 30 మంది యువత పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చారు.ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ బాధ్యులు మ్యాక.వినోద్ యువతకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారిలో ద్యావ.సాయి, బందరకంటి.బాబు, చిలుముల.రఘు, దోమకొండ.ప్రదీప్, లంకదాసరి.రాకేష్, లంకదాసరి.వేణు, ద్యావ.వెంకటేష్, దాసరి.అంజయ్య, లంకదాసరి.శ్రీనివాస్,బందరకంటి.దుర్గయ్య, దాసరి.వేణు, లంకదాసరి.అజయ్, లంకదాసరి.సాగర్, మ్యాక.విజయ్, సుంకేపాక.రమేష్, అలవాల.హరీష్, నామపూర్.పవన్, దోమకొండ.మల్లయ్య, ద్యావ.పవన్, రాఘవేంద్ర తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా మ్యాక.వినోద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం కోసం తెలంగాణ రక్షణ సేన కృషి చేస్తుందని తెలిపారు. యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

చొప్పదండి నియోజకవర్గంలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది యువత తెలంగాణ రక్షణ సేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, పార్టీ బలోపేతానికి యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు.