BREAKING
ఘన్గాపూర్‌లో పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఈ నెల 30 వ వరకు ఓటర్ల జాబితా సవరణకు గడువు. వైద్య చికిత్సకు రూ.50 వేల ఎల్ఓసీ మంజూరు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నైరుతి యెమెన్‌లో సౌదీ వైమానిక దాడులు యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం పత్తికొండలో పంచాయతీ నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత కార్తిక పౌర్ణమి వేళ పుణ్యస్నానాలు.. గంగా, యమునా ఘాట్‌లకు పోటెత్తిన భక్తులు సత్తాచాటిన మదనపల్లి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు : 10వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ : హర్షం వ్యక్తం చేసిన కోచ్ మురళి గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, శుభాకాంక్షలు భూభారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ మాదక ద్రవ్యాల పరిశీలన తెలంగాణ రక్షణ సేనలోకి గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన దాదాపు 30 మంది యువత చేరిక ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు చీరాలలో చిరుజల్లులు.. మారిన వాతావరణం మూడో రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ పర్యటన

సత్తాచాటిన మదనపల్లి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు : 10వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ : హర్షం వ్యక్తం చేసిన కోచ్ మురళి

Select Suryaa Now
సత్తాచాటిన మదనపల్లి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు : 10వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ : హర్షం వ్యక్తం చేసిన కోచ్ మురళి

 

మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : కర్ణాటక రాష్ట్రం,తుమకూరులో లయన్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఫౌండర్,ప్రెసిడెంట్ సి.జి.ప్రకాష్ నేతృత్వంలో నిర్వహించిన 10వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో మదనపల్లెకు చెందిన “లీ” మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు సత్తాచాటారు.ఇందులో భాగంగా లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు మాస్టర్ మురళికి అరుదైన గౌరవం లభించింది.ఆయనకు ఛాంపియన్ మెమెంటోతోపాటు జ్ఞాపికను అందించి,దుశ్శాలువతో సెన్సాయ్ సి.జి. ప్రకాష్ ఘనంగా సత్కరించారు.ఈ జాతీయ స్థాయి పోటీల్లో అకాడమీకి చెందిన కే.హారిక,కే.మోక్షిత్,సి.హర్మేంద్ర వర్షెల్,సి.పృథ్విక్ నందన్,ఎం.నిత్యానాయక్,ఎం.దిశాంత్ నాయక్,చందు,విదూష,ప్రేరణ,రుత్విక్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.విద్యార్థులు కటా,కుమితే విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించి మెమెంటోలు,షీల్డులు,ట్రోఫీలు సాధించి అకాడమీ,మదనపల్లె పట్టణ కీర్తి ప్రతిష్ట పెంచారు.విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ అక్కడ పాల్గొన్న కరాటే మాస్టర్లు,కోచ్‌లు,విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.మాస్టర్ మురళి శిక్షణలో విద్యార్థులు జాతీయస్థాయిలో విజయాలు సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి