BREAKING
ఘన్గాపూర్‌లో పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఈ నెల 30 వ వరకు ఓటర్ల జాబితా సవరణకు గడువు. వైద్య చికిత్సకు రూ.50 వేల ఎల్ఓసీ మంజూరు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నైరుతి యెమెన్‌లో సౌదీ వైమానిక దాడులు యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం పత్తికొండలో పంచాయతీ నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత కార్తిక పౌర్ణమి వేళ పుణ్యస్నానాలు.. గంగా, యమునా ఘాట్‌లకు పోటెత్తిన భక్తులు సత్తాచాటిన మదనపల్లి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు : 10వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ : హర్షం వ్యక్తం చేసిన కోచ్ మురళి గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, శుభాకాంక్షలు భూభారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ మాదక ద్రవ్యాల పరిశీలన తెలంగాణ రక్షణ సేనలోకి గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన దాదాపు 30 మంది యువత చేరిక ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు చీరాలలో చిరుజల్లులు.. మారిన వాతావరణం మూడో రోజు కొనసాగుతున్న కాంగ్రెస్ ఇంచార్జి సందీప్ పర్యటన

వైద్య చికిత్సకు రూ.50 వేల ఎల్ఓసీ మంజూరు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Select Suryaa Now
వైద్య చికిత్సకు రూ.50 వేల ఎల్ఓసీ మంజూరు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, మేజర్ న్యూస్: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి మండలం కోట మర్పల్లి గ్రామానికి చెందిన బేరళ్లి అండాళమ్మ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి రూ.50 వేల ఎల్ఓసీ మంజూరయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అండాళమ్మకు ఆర్థిక సహాయం అందేలా స్పీకర్ కృషి చేశారు. కష్టకాలంలో అండగా నిలిచి వైద్య ఖర్చుల కోసం ఎల్ఓసీ మంజూరు చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు, సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండాళమ్మ కుమారుడు మాణిక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.