BREAKING
28వ వార్డు కౌన్సిలర్‌గా పచ్చిపాల రామకృష్ణ ఆచారి ప్రమాణం : అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జహా,చైర్మన్ శ్రీరామ్ చినబాబు : శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు,వార్డు ప్రజలు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా..? టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య విధ్వంసం.. నవంబర్ 25 నుండి అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం: జిల్లా ఎస్పీ రేపటి నుంచి 'నషా ముక్త్ భారత్' పాదయాత్ర.. పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత డైరీలో సంచలన విషయాలు మళ్లీ రాబోతున్న 'గోల్డ్ స్పాట్'.. ఘన్గాపూర్‌లో పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఈ నెల 30 వ వరకు ఓటర్ల జాబితా సవరణకు గడువు. వైద్య చికిత్సకు రూ.50 వేల ఎల్ఓసీ మంజూరు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నైరుతి యెమెన్‌లో సౌదీ వైమానిక దాడులు యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం పత్తికొండలో పంచాయతీ నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత కార్తిక పౌర్ణమి వేళ పుణ్యస్నానాలు.. గంగా, యమునా ఘాట్‌లకు పోటెత్తిన భక్తులు సత్తాచాటిన మదనపల్లి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు : 10వ జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ : హర్షం వ్యక్తం చేసిన కోచ్ మురళి

ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా..?

Select Suryaa Now
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా..?

ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా..?

మాజీ మంత్రి శైలజానాథ్‌ను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

 – వైఎస్సార్‌సీపీ మండల కార్యాలయం వద్ద ఉద్రిక్తత

పుట్లూరు, మేజర్ న్యూస్: ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రాజకీయ చిచ్చు పెట్టడానికి వచ్చారా అంటూ మాజీ మంత్రి శైలజానాథ్‌ను పుట్లూరులో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. మండలంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న సమయంలో గ్రామాల మధ్య విభేదాలు సృష్టించి, రాజకీయ కక్షలను పెంచే ప్రయత్నాలు చేయవద్దంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి శైలజానాథ్ పుట్లూరుకు వచ్చిన విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ మండల కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్యాలయాన్ని చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశాయి. గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా ఉంటూ సామరస్యపూర్వక వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తుంటే, ఇప్పుడు రాజకీయ జోక్యం చేసుకుని గ్రామాల్లో విభేదాలు పెంచేందుకు ప్రయత్నించడం తగదని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గ్రామాల్లో ఎలాంటి గొడవలు, కక్షలు లేకుండా ప్రజలు కలిసిమెలిసి ఉండాలని, రాజకీయ ప్రయోజనాల కోసం గ్రామాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను సహించబోమని టీడీపీ శ్రేణులు నినాదాలు చేసినట్లు సమాచారం. దీంతో వైఎస్సార్‌సీపీ మండల కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. అనంతరం పోలీసుల సూచన మేరకు మాజీ మంత్రి శైలజానాథ్ అక్కడి నుంచి అనంతపురం వైపు వెనుదిరిగారు. దీంతో కొంతసేపు కొనసాగిన ఉద్రిక్తత సద్దుమణిగింది.