telangana
రేపటి నుంచి 'నషా ముక్త్ భారత్' పాదయాత్ర..
హైదరాబాద్, నవంబర్ 24: మాదకద్రవ్యాల (డ్రగ్స్) రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం (నవంబర్ 25) నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో 'వాక్ ఫర్ నషా ముక్త్ భారత్' పాదయాత్ర జరగనుంది. అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ పాదయాత్ర, ఈ నెల 27వ తేదీన నిర్వహించే భారీ 'సంకల్ప సభ'తో ముగియనుంది.
పాదయాత్ర ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో డ్రగ్స్ మహమ్మారి ఒకటని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రముఖుల మద్దతు:2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ సాధించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రజా ఉద్యమంలో సినీ, క్రీడా, స్వచ్ఛంద సంస్థల ప్రముఖులు భాగస్వాములవుతున్నారు.