BREAKING
పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి :వైద్యాధికారిని హైమశ్రీ అక్షర సాధన తో అధిరోహించిన శిఖరం పోలీసుల విధులపై చిన్నారులకు అవగాహన సిబ్బంది సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేయాలి జిల్లా పరిషత్ చైర్మన్ బి సి అయితే..మాకు అవకాశం ఇవ్వండి.. : చింతా శంకర్ మూర్తి.. ఈవో వర్సెస్.. చైర్మన్ వాడిగా వేడిగా కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు సమావేశం వేయి స్తంభాల దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య మెరిసే అందమైన చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన బాల్యం, బాలికల విద్యకు ప్రాధాన్యమివ్వాలి.. లింగ వివక్షకు తావులేదు ఢిల్లీలో ఉద్రిక్తత: రాహుల్ గాంధీ అదుపులోకి, సంఘీభావానికి వెళ్లిన సీఎం రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు మైనారిటీ గురుకులంలో విద్యార్థిపై దాడి ఆరోపణ జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర…

మైనారిటీ గురుకులంలో విద్యార్థిపై దాడి ఆరోపణ

Select Suryaa Now
మైనారిటీ గురుకులంలో విద్యార్థిపై దాడి ఆరోపణ

సూర్య కరీంనగర్: కరీంనగర్‌లోని మైనారిటీ గురుకుల (బాలురు-1) పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిపై ప్రిన్సిపాల్ దాడి చేశారంటూ ఆరోపణలు వెలువడ్డాయి. రెండు రోజుల క్రితం విద్యార్థి కేంద అక్షిత్ (తండ్రి: మహేందర్)పై ప్రిన్సిపాల్ విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన అనంతరం విద్యార్థి తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడని వారు తెలిపారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల, తంగేళ్ల కిరణ్ కుమార్ పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ కొట్టడం వల్లే తమ కుమారుడి పరిస్థితి ఇలా మారిందని ఆరోపించారు. తొలుత వైద్య ఖర్చులు తామే భరిస్తామని చెప్పిన ప్రిన్సిపాల్ ప్రస్తుతం బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థి వైద్య ఖర్చులను ప్రభుత్వం వెంటనే భరించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థిపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బండారి శేఖర్ డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థికి మెరుగైన వైద్యం అందించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.