BREAKING
పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి :వైద్యాధికారిని హైమశ్రీ అక్షర సాధన తో అధిరోహించిన శిఖరం పోలీసుల విధులపై చిన్నారులకు అవగాహన సిబ్బంది సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేయాలి జిల్లా పరిషత్ చైర్మన్ బి సి అయితే..మాకు అవకాశం ఇవ్వండి.. : చింతా శంకర్ మూర్తి.. ఈవో వర్సెస్.. చైర్మన్ వాడిగా వేడిగా కనకమహాలక్ష్మి ట్రస్ట్ బోర్డు సమావేశం వేయి స్తంభాల దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య మెరిసే అందమైన చర్మం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన బాల్యం, బాలికల విద్యకు ప్రాధాన్యమివ్వాలి.. లింగ వివక్షకు తావులేదు ఢిల్లీలో ఉద్రిక్తత: రాహుల్ గాంధీ అదుపులోకి, సంఘీభావానికి వెళ్లిన సీఎం రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు మైనారిటీ గురుకులంలో విద్యార్థిపై దాడి ఆరోపణ జిల్లా పొలిటికల్ అవేర్‌నెస్ చైర్‌పర్సన్‌గా సుదా గణపతి.. రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర…

పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన బాల్యం, బాలికల విద్యకు ప్రాధాన్యమివ్వాలి.. లింగ వివక్షకు తావులేదు

Select Suryaa Now
పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన బాల్యం, బాలికల విద్యకు ప్రాధాన్యమివ్వాలి.. లింగ వివక్షకు తావులేదు

కడియం: మేజర్ న్యూస్,:పోషకాహార మాసోత్సవం, అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమాలను కడియం జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించారు. ఎంఈఓ మణికుమార్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ టీ.శ్రీదేవి, సిడిపిఓ బి. ఆపరంజి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పోషకాహారం ప్రాముఖ్యత, జంక్‌ఫుడ్‌ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని  తెలిపారు.
పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమని, తల్లిదండ్రులు పిల్లలకు పౌష్టిక విలువలున్న ఆహారాన్ని అందించాలని వారు సూచించారు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండి, ఆకుకూరలు, పండ్లు, పప్పుధాన్యాలు, గుడ్లు వంటి పోషకాహారాన్ని తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
అదేవిధంగా బాలికల విద్యకు ప్రాధాన్యమివ్వాలని, బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలని, లింగ వివక్షకు తావులేకుండా చూడాలన్నారు.. బాలికలు విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించేలా తల్లిదండ్రులు, సమాజం ప్రోత్సహించాలని సూచించారు. బాలికల హక్కులు, భద్రత, విద్యపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ మణికుమారి, అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.