బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
పిఎం పాలెం, సూర్య : మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బాపట్ల జిల్లా నిజాంపట్నంకు చెందిన కర్రి జ్ఞానేష్ వర్మ(19)ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక ప్రైవేటు కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జ్ఞానేష్ .. తన అక్క మరో ప్రాంతానికి వెళ్లడంతో కొద్దిరోజులుగా అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగానే ఉంటున్నాడు.తీవ్ర మనస్తాపానికి గురైన అతడు గత ఆదివారం గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. బుధవారం ఉదయం మొక్కలకు నీళ్లు పోసేందుకు భవనం పైకి వెళ్లిన వాచ్‌మెన్‌కు గది నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో చూడగా.. అప్పటికే మృతదేహం కుళ్లిపోయి వేలాడుతూ కనిపించింది. 'అమ్మానాన్న.. నన్ను క్షమించండి, నాకోసం ఎంతో చేశారు.. కానీ నేనేమీ చేయలేకపోయాను, నేను ఒక మూర్ఖుడిని, ఎవరూ నాకోసం బాధపడొద్దు.. ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్‌తో వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
రిపోర్టర్ : శ్రీనివాస్, పీఎం పాలెం విశాఖపట్నం జిల్లా