BREAKING
మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ఆంత్రోపిక్ ఐపీఓకు గంటల్లోనే లక్ష మందికి పైగా గ్రో యూజర్ల ఆసక్తి.. ఆ స్పందనతో ప్రణాళికలు మార్చుకున్న సంస్థ! ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి... జిల్లా కలెక్టర్ఆశీష్ సంఘ్వాన్ ఎస్‌బీఐ చిన్న, మధ్యతరహా వ్యాపార రుణ పరిమితి పెంపు.. ఎంఎస్‌ఎంఈ రంగానికి భారీ ఊతం! నేడు మండలానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాక

జిల్లా పరిషత్ చైర్మన్ బి సి అయితే..మాకు అవకాశం ఇవ్వండి.. : చింతా శంకర్ మూర్తి..

Select Suryaa Now
జిల్లా పరిషత్ చైర్మన్ బి సి  అయితే..మాకు అవకాశం ఇవ్వండి.. : చింతా శంకర్ మూర్తి..

సూర్య అమలాపురం రూరల్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన జిల్లా పరిషత్ (ZP) చైర్మన్ పదవిని బీసీ వర్గాలకు కేటాయిస్తే.. చేనేత కోటాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నేత చింతా శంకరమూర్తికి అవకాశం కల్పించాలని టీడీపీ నాయకులు కోరారు. ఈ మేరకు గ్రామ పార్టీ అధ్యక్షులు పిచ్చిక శ్యామ్ ఆధ్వర్యంలో స్థానిక నేతల బృందం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసింది.

శ్రీశైల దేవస్థానం మాజీ పాలకవర్గ సభ్యుడిగా, గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడిగా (ZPTC) విశేష సేవలందించిన అనుభవం చింతా శంకరమూర్తికి ఉందని నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేస్తూ, చేనేత వర్గాల సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్న ఆయనకు జడ్పీ చైర్మన్ పీఠం దక్కితే జిల్లా సమగ్రాభివృద్ధికి మరింత న్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించి సానుకూల నిర్ణయం తీసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు పుత్సల వరదరాజు, ఆశపు రామలింగేశ్వరరావు, కొండా శ్రీను, బళ్ళ వెంకటేశ్వరరావు, మాడా మాధవి, యాళ్ళ సుబ్బలక్ష్మి, కాశిన బాబి, కొండా సత్యనారాయణ రాజు, యాళ్ల కుమార్, ఏకుల విజయ్, చింతా రాజు, మల్లవరపు ఏడుకొండలు, బళ్ళ కిషోర్, మాడా తిలక్, మావూరి సాంబతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.