BREAKING
మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం* ఎన్నికల సామగ్రి అప్పగించే వరకు పోలింగ్ విధులు కొనసాగాల్సిందే: గుజరాత్ ఎన్నికల సంఘం స్పష్టీకరణ! పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలు: జూన్ ఆటో అమ్మకాల్లో జోరు: టీవీఎస్ సేల్స్ 47 శాతం, బజాజ్ ఆటో 28 శాతం జంప్.. అంచనాలను మించిన వృద్ధి! అమెరికాకు అసాధారణ ప్రతిభావంతులు మాత్రమే కావాలి: నేటి రాశి ఫలాలు: 9 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 9 అక్టోబర్ 2026 శుక్రవారం పిఆర్టియు నారాయణపేట మండల అధ్యక్షులుగా మొల్గాన్ జనార్ధన్ 5 వ వార్డులో తడి పొడి కి చెత్త బుట్టలు పంపిణీ జర్నలిస్టులు నిజాయితీగా వార్తలు రాయాలి.. తప్పుడు కథనాలు రాస్తే శిక్షార్హులు.. పోలీసులు, మీడియా సమన్వయంతో పనిచేయాలి : ఎస్పీ వినీత్ సాకి చెరువు కట్టపై బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సినిమాకు భారీ నష్టం.. ఏకంగా రూ.1,350 కోట్లు గల్లంతు! ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం* కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడం శోచనీయం

రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత మారే వీరేంద్ర…

Select Suryaa Now
రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ విజేత  మారే వీరేంద్ర…

అమలాపురం మేజర్ న్యూస్ ఈనెల 4, 5వ తేదీల్లో  ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగిన  13వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి సీనియర్ పవర్ లిప్టింగ్  క్లాసిక్ బెంచ్ ప్రెస్ పోటీల్లో  అమలాపురం - హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్  నేషనల్ లిఫ్టర్  మారే వీరేంద్ర రాష్ట్రంలో అత్యధికంగా బెంచ్ ప్రెస్ రికార్డు లిఫ్టు  155 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం తో పాటు  రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ టైటిల్ ను గెలుసుకున్నారు. 

 రాష్ట్ర స్ట్రాంగ్ మెన్ గా టైటిల్ గెలుచుకున్న  మారే వీరేంద్రను  క్రీడా ప్రముఖులు సమక్షంలో అభినందించడానికి హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ లైఫ్ మెంబర్ గారపాటి చంద్రశేఖర్  అధ్యక్షతన  ఏర్పాటుచేసిన కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా విచ్చేశారు.  జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ  పప్పుల శ్రీరామచంద్రమూర్తి  క్రీడల ప్రాముఖ్యతను తెలియజేస్తూ క్రీడా రిజర్వేషన్ ద్వారా  ఉన్నత విద్య, ఉద్యోగ &  నగదు స్కాలర్షిప్లను మొదలగు  అవకాశాలను ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములు కల్పిస్తున్నాయన్నారు.

  క్రీడాకారులు ఈ అవకాశాన్ని అందుకోవాలని కోరుతూ వారికి శుభాభినందనలు తెలిపారు.ఈనెల  9, 10 11 తేదీల్లో  కాకినాడలో జరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్  వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు  వాసంశెట్టి మేఘన, కొండేటి వేణు మానస్, గుంటూరు దినేష్ ప్రసాద్, తణుకు జగదీశ్వర్   ల ను ఘనంగా సత్కరించారు.
ఈ అభినందన ఉత్సవ కార్యక్రమంలో   ఆశెట్టి ఆదిబాబు, కె. మణికంఠ వర్మ, గోకరకొండ దొరబాబు, దొమ్మేటి రాము, నక్క సుధాకర్ బాబు, తరుణ్, ఎం.ఆర్. కె, సుబాజి, చీకట్ల సత్యనారాయణమూర్తి, బి. యశ్వంత్ & హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ క్రీడాకారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారని కోచ్ కంకిపాటి వెంకటేశ్వర రావు తెలిపారు