ఈనెల 12 నుండి బోయకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు
- శ్రీరామ్ చినబాబు,కూటమి నేతలకు ఆహ్వానం
మదనపల్లె : అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం,చౌడేపల్లె మండలంలో వెలసిన శ్రీబోయకొండ గంగమ్మ దేవస్థానంలో ఈనెల 12వ తేదీ నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఈ నేపథ్యంలో గురువారం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు,టీడీపీ సీనియర్ నాయకులు సీడ్ మల్లికార్జున నాయుడు,రన్ టీవీ ఛానల్ అధినేత,జనసేన నాయకులు సిరివేలు చరణ్ కుమార్లకి అరుణ్ ఆహ్వాన పత్రికలు అందజేశారు.ఈ నెల 12 నుండి 20 వరకు శ్రీబోయకొండ గంగమ్మ దేవస్థానం నందు జరిగే దసరా మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు,కూటమి నేతలని కోరారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రముఖ శక్తిక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన బోయకొండలో ప్రతి ఏడాది నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ అన్నారు.ఈ ఏడాది సైతం బ్రహ్మోండంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.ఈ ఉత్సవాలకు కూటమి నాయకులతో కలిసి పాల్గొంటానని తెలిపారు.బోయకొండ గంగమ్మ తల్లి కృపాకటాక్షాలతో ప్రజలు ఆనందంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు.టీడీపీ నాయకులు బండి అమర,మనోహర్ కూడా
శ్రీరామ్ చినబాబుతో కలిసి ఆహ్వానం అందుకున్నారు.
కె. ఈశ్వర్ రెడ్డి, మదనపల్లె నియోజకవర్గం ఇంచార్జి