BREAKING
కొండేపి అభివృద్ధికి జోడు అడుగులు డోల బాల వీరాంజనేయ స్వామి దామచర్ల సత్య హెచ్-1బీ వ్యవస్థలో భారీ మోసాలు జరుగుతున్నాయి.. జలజీవన్ మిషన్ 90 లక్షల నిధులతో త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన.......... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గంగమ్మ ఒడికి చేరిన అతి భారీ ఏకదంత వినాయకుడు తంబళ్లపల్లె సీనియర్ సిటిజన్స్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం మిట్స్‌ వర్సిటీలో ఘనంగా భారత వైమానిక దళ దినోత్సవం రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికీ గాయాలు ఈనెల 12 నుండి బోయకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు టమోటా మార్కెట్ అభివృద్ధిలో కీలక సంస్కరణలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధత గ్యార్మీ మహోత్సవం(జెండా పండుగ) కార్యక్రమంలో పాల్గొన్న....... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గుజరాత్‌లో సబర్మతి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం తుది దశకు: 85 శాతానికి పైగా పనులు పూర్తి. మునగ ప్లాంటేషన్ పనులను పరిశీలించిన జెడ్పీ సీఈఓ బిసి సంక్షేమ గురుకుల పాఠశాలకు ఐదు సీలింగ్ ఫ్యాన్లు వితరణ పరిహారం ఇవ్వకుండా పనులెలా చేస్తారు?

బిసి సంక్షేమ గురుకుల పాఠశాలకు ఐదు సీలింగ్ ఫ్యాన్లు వితరణ

Select Suryaa Now
బిసి సంక్షేమ గురుకుల పాఠశాలకు ఐదు సీలింగ్ ఫ్యాన్లు వితరణ


- వాసవి క్లబ్ ప్రెసిడెంట్ వివి కృష్ణారావు వెల్లడి
మదనపల్లె  : వాసవి క్లబ్ పర్మనెంట్ ప్రాజెక్టులో భాగంగా గురువారం  సర్కార్ తోపు,చేనేత నగర్ నందు గల మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలకు రూ.8,500 విలువ గల ఐదు సీలింగ్ ఫ్యాన్లు వితరణ చేయడం జరిగిందని వాసవి క్లబ్ ప్రెసిడెంట్ వివి కృష్ణారావు తెలిపారు.ఇందులో నాలుగు సీలింగ్ ఫ్యాన్లు లక్కీ టైల్స్ అధినేత ముంటిమడుగు నగేష్,ఒక సీలింగ్ ఫ్యాన్ వాసవి క్లబ్ తరపున మొత్తం ఐదు సీలింగ్ ఫ్యాన్లు మదనపల్లె వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు అందజేశారు.ఈ సందర్భంగా వి.వి.కృష్ణారావు మాట్లాడుతూ పాఠశాల హెచ్ఎం విజ్ఞప్తి మేరకు విద్యార్థుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.వాసవి క్లబ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాల కల్పనకు తమ పరిధికి లోబడి సేవలను అందించడం జరుగు తోందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వివి కృష్ణారావు,సెక్రటరీ వినయ్ కుమార్,ఫాస్ట్ ప్రెసిడెంట్స్ ముంటి మడుగు నగేష్,పులిరాజ్ ఆనంద్,అక్కిశెట్టి శ్రీనాథ్,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బికే అనిల్ కుమార్ పాల్గొన్నారు.

 

కె. ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి