BREAKING
పిఆర్టియు నారాయణపేట మండల అధ్యక్షులుగా మొల్గాన్ జనార్ధన్ 5 వ వార్డులో తడి పొడి కి చెత్త బుట్టలు పంపిణీ జర్నలిస్టులు నిజాయితీగా వార్తలు రాయాలి.. తప్పుడు కథనాలు రాస్తే శిక్షార్హులు.. పోలీసులు, మీడియా సమన్వయంతో పనిచేయాలి : ఎస్పీ వినీత్ సాకి చెరువు కట్టపై బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సినిమాకు భారీ నష్టం.. ఏకంగా రూ.1,350 కోట్లు గల్లంతు! ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం* కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడం శోచనీయం క్షయ వ్యాధి నిర్మూలించడంలో చిన్న చెల్మెడ గ్రామం అన్నదాన కార్యక్రమానికి రూపాయలు 50,000/- విరాళం రెబల్ స్టార్ ప్రభాస్ 'ఫౌజీ' సినిమా విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే? కాంగ్రెస్ తోనే పట్టణ అభివృద్ధి రైతులకు రాయితీపై శనగ విత్తనాలు సొంత ఊరికి సేవా భావంతో చేయూత సీఈసీ రాజీనామా డిమాండ్ తో కాంగ్రెస్ శ్రేణుల రాస్తారోకో దృశ్యం 3 బాక్సాఫీస్ సునామీ.. మొదటి వారంలోనే 245 కోట్ల కలెక్షన్లతో రికార్డుల మోత!

గంగమ్మ ఒడికి చేరిన అతి భారీ ఏకదంత వినాయకుడు

Select Suryaa Now
గంగమ్మ ఒడికి చేరిన అతి భారీ ఏకదంత వినాయకుడు


- 25 రోజులపాటు విశేష పూజలు,అభిషేకాలు
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కళాబృందాలు
మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లె పట్టణం,సిటిఎం రోడ్డు,జీఆర్టీ జ్యువలరీస్ ఎదురుగా ఏకదంతాయ మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన భారీ ఏకదంత వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుకున్నారు.మదనపల్లె ప్రజలనే కాదు,చుట్టుపక్కల గ్రామాలు,పట్టణాల ప్రజలను సైతం తనవైపు తిప్పుకున్నాడు.25 అడుగుల గణనాధుడు 25 రోజుల నిత్యపూజలు అందుకున్న విఘ్నశ్వరుడి నిమజ్జనోత్సవం భక్తి,కళ,సంస్కృతి,సంప్రదాయాల మహాసంగమం నడుమ కన్నుల పండుగలా సాగింది.మదనపల్లెకు మరో ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చిన అద్భుతం ఏమిటంటే పూరీ జగన్నాథ ఆలయంపైన రెపరెపలాడే పవిత్ర జెండా,ఏకదంతాయ మిత్ర మండలి మండపంపైకి చేరడమని తెలిపారు.ఇది కేవలం ఒక జెండా కాదు,ఒక ఆధ్యాత్మిక అనుభూతి,ఒక మహద్భాగ్యం,మదనపల్లెకు దక్కిన అపూర్వ గౌరవం.ఈ 25 రోజుల వేడుకలకు ఘనమైన ముగింపుగా అక్టోబర్ 8న జరిగిన వినాయక నిమజ్జన మహోత్సవం మదనపల్లె చరిత్రలోనే ఒక అద్భుత దృశ్యంగా నిలిచిపోయింది.కాశీ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలోని వివిధ ప్రాంతాల కళలు,సంప్రదాయాలను ప్రతిబింబించేలా దాదాపు 350 నుంచి 400 మంది కళాకారులు ఈ మహా ఊరేగింపులో పాల్గొని తమ అద్భుతమైన కళా ప్రదర్శనలతో మదనపల్లెను హోరెత్తించారు.నాసిక్ డోలు,నరసింహ అవతారం,హోస్పేట్ డ్రమ్స్,తెలంగాణ-ఆంధ్ర సంప్రదాయ కళలు,తెనాలి కళాకారుల ప్రదర్శనలు,డిజె 
కోలాటం,చెండమేళం,తెయ్యం,బ్యాండ్ సెట్స్,కొమ్ములు,చక్కభజన,పిల్లనగ్రోవి వాయిద్యాలు,పాలకీలు ఆకర్షణగా నిలిచాయి.ఇలా ఒక్కో కళారూపం,ఒక్కో సంప్రదాయం,ఒక్కో వాయిద్యం పువీధుల్లో ఒక మహాకళా వైభవాన్ని ఆవిష్కరించింది.వేలాది మంది ప్రజలు రోడ్లకు ఇరువైపులా నిలబడి భక్తిశ్రద్ధలతో,ఆనందోత్సాహాలతో తమ ప్రియమైన ఏకదంతుడి మహా ఊరేగింపును వీక్షిస్తూ వీడ్కోలు పలికారు.చిన్నారుల నుంచి పెద్దల వరకు,మహిళల నుంచి యువత వరకు మదనపల్లె మాత్రమే కాదు,చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి ఒక్కసారిగా భక్తిసాగరంగా మార్చేశారు.ఇది కేవలం ఒక వినాయక చవితి వేడుక కాదు,ఇది భక్తికి ప్రతిరూపం,
ఇది కళలకు వేదిక,ఇది సంప్రదాయాలకు పండుగ,ఇది మదనపల్లె ఐక్యతకు ప్రతీక,ఇది ఏకదంతాయ మిత్ర మండలి సృష్టించిన ఒక మరపురాని చరిత్రని పట్టణ ప్రజలు,భక్తులు అభివర్ణించారు.

 

కె. ఈశ్వర్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి