కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడం శోచనీయం
*ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా
ధర్మసాగర్ ప్రతినిధి
భారత ఎన్నికల సంఘం జ్ఞానేష్ కుమార్ చేస్తున్న అవినీతి పనులకు భారత ప్రభుత్వం మద్దతు తెలపడంపై ప్రశ్నించిన ఎంపీలను అక్రమంగా అరెస్ట్ చేయడం శోచనీయమని ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెసరు రమేష్ అన్నారు. ఢిల్లీలో ఇండియా కూటం నేతల అక్రమంగా అరెస్ట్ చేయటం వెనుక బిజెపి అంతర్యాన్ని ప్రజల గమనిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షులకు అనుకూలమైన ఓట్లను తొలగిస్తూ అధికార పక్షానికి సంబంధించిన ఓట్లను ఉంచుతున్న వ్యక్తి ఎస్ ఐ ఆర్ పేరుతో చేస్తున్న అవినీతిని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇండియా కూటమి ఎంపీలు ప్రశ్నించడంతో అక్రమంగా వారిని అరెస్ట్ చేయాలని చూడటం బిజెపి కి సిగ్గుమాలిన పని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని ఆ హక్కును జ్ఞానేష్ కుమార్ బిజెపికి అనుకూలంగా మలుస్తూ ఓటు చోరీకి పాల్పడుతున్నాయి అన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అక్రమంక గద్దెక్కిన బిజెపి పార్టీని స్వయంగా వారి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ తప్పు పట్టడంతో నేడు పరిస్థితి తిరగబడిందని అన్నారు. బిజెపి ఓటు చోరీతో గదికిక్కిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీ ఎప్పటినుండో ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నాడని అన్నారు. ఈ విషయంలో బిజెపి కల్పించుకొని జ్ఞానేష్ కుమార్ ని తన పదవి నుండి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.