BREAKING
గోటేటి రామమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్.. ముక్కామల జాతీయ రహదారి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.. క్షయ వ్యాధి నిర్మూలన పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..:జిల్లా జాయింట్ కలెక్టర్ నైడియా దేవి. లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా మద్యం షాపుల లైసెన్సులు.... జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బారావు.. వైసీపీ గెలుపునకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి.. కొల్లు త్రినాధ వర్మ.. స్పైస్‌జెట్‌కు ఊరట: ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 150 కోట్ల తొలి విడత ఈసీఎల్‌జీఎస్ నిధులు విడుదల! వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం అభ్యంతరం: జీఎస్టీ కౌన్సిల్ భేటీ: ఫేస్‌లెస్, పారదర్శక పన్ను విధానం దిశగా కీలక అడుగు...కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన! పోర్ట్స్ క్యూ2 ఫలితాల ప్రివ్యూ: అంతరాయాలున్నా సానుకూలంగానే కార్గో అవుట్‌లుక్.. విదేశీ ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం: మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం* ఎన్నికల సామగ్రి అప్పగించే వరకు పోలింగ్ విధులు కొనసాగాల్సిందే: గుజరాత్ ఎన్నికల సంఘం స్పష్టీకరణ! పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలు: జూన్ ఆటో అమ్మకాల్లో జోరు: టీవీఎస్ సేల్స్ 47 శాతం, బజాజ్ ఆటో 28 శాతం జంప్.. అంచనాలను మించిన వృద్ధి!

జర్నలిస్టులు నిజాయితీగా వార్తలు రాయాలి.. తప్పుడు కథనాలు రాస్తే శిక్షార్హులు.. పోలీసులు, మీడియా సమన్వయంతో పనిచేయాలి : ఎస్పీ వినీత్

Select Suryaa Now
జర్నలిస్టులు నిజాయితీగా వార్తలు రాయాలి.. తప్పుడు కథనాలు రాస్తే శిక్షార్హులు.. పోలీసులు, మీడియా సమన్వయంతో పనిచేయాలి : ఎస్పీ వినీత్

నారాయణపేట, సూర్యన్యూస్:
జర్నలిస్టులు వారి హోదాకు తగ్గట్టుగా హుందాగా వ్యవహరిస్తూ ప్రజలకు ఉపయోగపడే వార్తలను నిజాయితీగా రాయాలని, నిరాధారమైన, తప్పుడు కథనాలు రాస్తే చట్టప్రకారం శిక్షార్హులు అవుతారని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. పోలీస్‌, మీడియా సమన్వయంతోనే ప్రజలకు మెరుగైన సేవలందించగలమని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన  పోలీస్, ప్రెస్  గెట్ టు గెదర్ కార్యక్రమానికి ఎస్పీ డాక్టర్ వినీత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసు శాఖతో పాటు ప్రజలకు సేవలందించడంలో మీడియా కూడా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభంగా, వాచ్‌డాగ్‌గా పనిచేస్తూ ప్రభుత్వ శాఖలు, అధికారులు ప్రజలకు అందించాల్సిన సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్తుందని పేర్కొన్నారు. పోలీసులు, మీడియా మధ్య పరస్పర సహకారం, సమన్వయం ఎంతో అవసరమన్నారు. పోలీసు శాఖలో రోజువారీ విధుల్లో ఎదురయ్యే సమస్యలు, లోపాలను మీడియా నిర్మాణాత్మకంగా సూచించడం ద్వారా వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసు శాఖ లక్ష్యమని, ఇందుకు మీడియా సహకారం అవసరమన్నారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంపొందించడంలో మీడియా పాత్ర ముఖ్యమైనదని ఎస్పీ అన్నారు. పోలీసులపై ప్రజలకు విశ్వాసం ఉన్నప్పుడే నేరాల నియంత్రణతో పాటు సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావడంలో ప్రజలు ముందుకు వస్తారని తెలిపారు. పోలీసు, ప్రజల మధ్య విశ్వాసం, సత్సంబంధాలను పెంపొందించేందుకు మీడియా వారధిగా పనిచేస్తోందన్నారు. కరోనా సమయంలో పోలీసులతో పాటు వైద్యులు, మీడియా ప్రతినిధులు ప్రజలకు సేవలందించేందుకు ముందుండి పనిచేశారని ఎస్పీ గుర్తుచేశారు. మీడియా సేవలను కూడా అత్యవసర సేవల్లో భాగంగా గుర్తించిన పరిస్థితులను ఆయన ప్రస్తావించారు. నారాయణపేట జిల్లాలో గత ఏడాది కాలంగా పోలీసు శాఖ చేపట్టిన కార్యక్రమాలు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది చేసిన కృషిని ఆయన అభినందించారు. జిల్లా పోలీసు శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని తెలిపారు. పోలీసు శాఖ విజయాలు ఏ ఒక్కరి కృషి ఫలితం కాదని, ప్రతి ఒక్కరి సమష్టి కృషితోనే సాధ్యమవుతాయని పేర్కొన్నారు. పోలీసు శాఖకు మీడియా అందిస్తున్న సహకారానికి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇదే విధమైన సహకారం, సమన్వయంతో పనిచేస్తూ నారాయణపేట జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కలిసి ముందుకు సాగుదామని ఆయన కోరారు. అంతకుముందు అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేశ్, డీపీఆర్వో రషీద్,  వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు నారాయణరెడ్డి, ఆనంద్, వెంకట్రాములు మాట్లాడారు. కార్యక్రమంలో  ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఎస్ఐ వెంకటేశ్వర్లు, జిల్లా పోలీసు అధికారులు  పాల్గొన్నారు.

– రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.