5 వ వార్డులో తడి పొడి కి చెత్త బుట్టలు పంపిణీ
5 వ వార్డులో తడి పొడి కి చెత్త బుట్టలు పంపిణీ
కౌన్సిలర్ కుమారి చెలిమెల కుమ్మరి ప్రియాంక
తూప్రాన్ ; తూప్రాన్ మున్సిపల్ లోని ఐదవ వార్డులో తడి పొడి చెత్తలను వేరు చేసే వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు, చెత్తబుట్టల పంపిణీకి కౌన్సిలర్ చెలిమెల కుమ్మరి కుమారి ప్రియాంక ఆధ్వర్యంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు చెలిమెల కుమ్మరి రఘుపతి కలిసి ఐదో వార్డులో తడి పొడి చేసే చెత్తబుట్టలను పంపిణీ చేశారు, వార్డు కౌన్సిలర్ చెలిమెల కుమ్మరి కుమారి ప్రియాంక, ఈ సందర్భంగా కౌన్సిలర్ ప్రియాంక మాట్లాడుతూ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని ప్రతి ఒక్కరూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్తబుట్టలో వేసి మున్సిపల్ ఆఫీసు నుండి వచ్చిన చెత్త బండి లోనే వేయాలని ఎక్కడ దొరికితే అక్కడ చెత్త వేయడం వల్ల దోమలు తీగల వల్ల కాలనీవాసులకు అనారోగ్యాలకు గురవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటారో పరిసరాలను కూడా అలాగనే ఉంచుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని కౌన్సిలర్ చెలిమెల ప్రియాంక తెలిపారు, ఈ కార్యక్రమంలో మున్సిపాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు