పిఆర్టియు నారాయణపేట మండల అధ్యక్షులుగా మొల్గాన్ జనార్ధన్
నారాయణపేట, సూర్యన్యూస్ :
నారాయణపేట మండల పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నూతన అధ్యక్షులుగా మొల్గాన్ జనార్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల అన్ని మండలాలతో పాటు నారాయణపేట మండల ఎన్నికలు జరుగగా అప్పుడు ఎన్నికైన అధ్యక్షులు రఘువీర్ తాజాగా నారాయణపేట జిల్లా గౌరవ అధ్యక్షులుగా నియమించబడ్డారు. ఆయన స్థానంలో షేర్నపల్లి గ్రామ పాఠశాలలో విధులు నిర్వహిస్తూ, గత కొన్ని సంవత్సరాలుగా మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న మొల్గాన్ జనార్దన్ ను బుధవారం ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో మండల నూతన అధ్యక్షులుగా ఎన్నిక చేశారు. అదేవిధంగా బైరంకొండలో విధులు నిర్వహిస్తున్న సాయప్పను మండల నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు వై జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి, గౌరవ అధ్యక్షులు ఎం రఘువీర్ మాట్లాడుతూ నూతన కార్యవర్గం మండలంలోని ఉపాధ్యాయులకు జిల్లా సంఘానికి అందుబాటులో ఉండి సంఘ ఉన్నతికి కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా పట్టణంలో జరుగుతున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పి అర్ టి యు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వై నారాయణ రెడ్డి, యూనియన్ బాధ్యులు సత్యనారాయణ రెడ్డి, రమేష్ రెడ్డి, నరసింహారెడ్డి, గఫార్, నర్సింగ్, అనిల్, బాలాజీ, అరవింద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
– రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.