సాకి చెరువు కట్టపై బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు
సాకి చెరువు కట్టపై బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు
-ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
-మహిళలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సౌకర్యాలు
-సినీ,జానపద కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు
పటాన్‌చెరు, ; సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని పటాన్‌చెరు సాకి చెరువు కట్టపై అక్టోబర్ 18న నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం సైబరాబాద్ మున్సిపల్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.వేలాది మంది మహిళలు తరలివచ్చే అవకాశం ఉన్నందున లైటింగ్, పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం,వేదిక తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ నిమజ్జన ఘాట్ వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టి గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సినీ, జానపద కళాకారులతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.సాకి చెరువుతో పాటు బండ్లగూడ, రామచంద్రాపురం, అమీన్‌పూర్, బీరంగూడ, తెల్లాపూర్, ముత్తంగి, బొల్లారం ప్రాంతాల్లోని బతుకమ్మ ఘాట్లను సైతం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, డీఈ కృష్ణవేణి, ఏఈలు లావణ్య, ఫైజన్ తదితరులు పాల్గొన్నారు.