BREAKING
గోటేటి రామమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్.. ముక్కామల జాతీయ రహదారి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.. క్షయ వ్యాధి నిర్మూలన పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..:జిల్లా జాయింట్ కలెక్టర్ నైడియా దేవి. లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా మద్యం షాపుల లైసెన్సులు.... జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బారావు.. వైసీపీ గెలుపునకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి.. కొల్లు త్రినాధ వర్మ.. స్పైస్‌జెట్‌కు ఊరట: ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 150 కోట్ల తొలి విడత ఈసీఎల్‌జీఎస్ నిధులు విడుదల! వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం అభ్యంతరం: జీఎస్టీ కౌన్సిల్ భేటీ: ఫేస్‌లెస్, పారదర్శక పన్ను విధానం దిశగా కీలక అడుగు...కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన! పోర్ట్స్ క్యూ2 ఫలితాల ప్రివ్యూ: అంతరాయాలున్నా సానుకూలంగానే కార్గో అవుట్‌లుక్.. విదేశీ ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం: మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం* ఎన్నికల సామగ్రి అప్పగించే వరకు పోలింగ్ విధులు కొనసాగాల్సిందే: గుజరాత్ ఎన్నికల సంఘం స్పష్టీకరణ! పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలు: జూన్ ఆటో అమ్మకాల్లో జోరు: టీవీఎస్ సేల్స్ 47 శాతం, బజాజ్ ఆటో 28 శాతం జంప్.. అంచనాలను మించిన వృద్ధి!

ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం*

Select Suryaa Now
ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం*

ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం
 ఖేడ్ లో డిసిసి అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా
నారాయణఖేడ్ ; కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు నారాయణఖేడ్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మహాధర్నా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్వగృహం నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేస్తూ మహాధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ఎన్నికల సంఘం తీరును మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ లు ప్రజాప్రతినిధులు, మండల, పట్టణ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.