జలజీవన్ మిషన్ 90 లక్షల నిధులతో త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన.......... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
పొన్నూరు మండలంలోని మామిళ్ళపల్లి గ్రామంలో పల్లెపండుగ 3.O కార్యక్రమంలో భాగంగా జలజీవన్ మిషన్ పథకానికి శ్రీకారం చుట్టటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పొన్నూరు శాసనసభ్యులు సంగం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్ పాల్గొని శంకుస్థాపన చేయడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, రక్షిత తాగునీటిని అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జలజీవన్ మిషన్ పథకం కింద 1.35 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చెయ్యటం జరిగిందన్నారు .గ్రామంలో కొత్తగా తాగునీటి ట్యాంక్ (ఓవరహెడ్ ట్యాంక్ ) నిర్మాణం పైప్‌లైన్ వ్యవస్థ విస్తరణ మరియు ఇంటింటికీ మంచి నీటిని అందించడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న జలజీవన్ మిషన్ ద్వారా తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు
పొన్నూరు NDP సూర్య రిపోర్టర్ :- శిలార్