BREAKING
కొండేపి అభివృద్ధికి జోడు అడుగులు డోల బాల వీరాంజనేయ స్వామి దామచర్ల సత్య హెచ్-1బీ వ్యవస్థలో భారీ మోసాలు జరుగుతున్నాయి.. జలజీవన్ మిషన్ 90 లక్షల నిధులతో త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన.......... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గంగమ్మ ఒడికి చేరిన అతి భారీ ఏకదంత వినాయకుడు తంబళ్లపల్లె సీనియర్ సిటిజన్స్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం మిట్స్‌ వర్సిటీలో ఘనంగా భారత వైమానిక దళ దినోత్సవం రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికీ గాయాలు ఈనెల 12 నుండి బోయకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు టమోటా మార్కెట్ అభివృద్ధిలో కీలక సంస్కరణలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధత గ్యార్మీ మహోత్సవం(జెండా పండుగ) కార్యక్రమంలో పాల్గొన్న....... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గుజరాత్‌లో సబర్మతి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం తుది దశకు: 85 శాతానికి పైగా పనులు పూర్తి. మునగ ప్లాంటేషన్ పనులను పరిశీలించిన జెడ్పీ సీఈఓ బిసి సంక్షేమ గురుకుల పాఠశాలకు ఐదు సీలింగ్ ఫ్యాన్లు వితరణ పరిహారం ఇవ్వకుండా పనులెలా చేస్తారు?

టమోటా మార్కెట్ అభివృద్ధిలో కీలక సంస్కరణలు

Select Suryaa Now
టమోటా మార్కెట్ అభివృద్ధిలో కీలక సంస్కరణలు


- జాక్‌పాట్ విధానం రద్దు,చిన్నక్రేట్ల విధానంతో రైతులకు మేలు
- ఎమ్మెల్యే షాజహాన్ బాషా,ఏఎంసి ఛైర్మెన్ జంగాల శివరాం రాయల్ స్పష్టం
మదనపల్లె : ఆసియాలోనే అతిపెద్దదైన వ్యవసాయ మార్కెట్‌యార్డు పాలక కమిటీ ఏడాది పాలనలో రైతుల సంక్షేమం,మార్కెట్‌యార్డు అభివృద్ధికి పలు కీలక చర్యలు చేపట్టినట్లు మార్కెట్‌యార్డు చైర్మన్ జంగాల శివరాం తెలిపారు.కమిటీ పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.ఈ సమావేశానికి మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.రాయలసీమ కో-కన్వీనర్ రాందాస్ చౌదరి,భాజపా సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,టీడీపీ,జనసేన నాయకులు పాల్గొన్నారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌యార్డులో అమలులో ఉన్న జాక్‌పాట్ విధానాన్ని రద్దు చేసినట్లు జంగాల శివరాం తెలిపారు.మండీ యజమానులు,వ్యాపారులు,రైతుల సహకారంతో చిన్న క్రేట్ల విధానాన్ని వంద శాతం విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.ఈ విధానం ద్వారా ఈ సీజన్‌లో మార్కెట్‌యార్డుకు రికార్డు స్థాయిలో టమాటాలు తరలివచ్చాయని,దీని ద్వారా రైతులకు ప్రయోజనం కలిగిందని తెలిపారు.టమోటా ధరలు పతనమైన సమయంలో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.అధికారులు,మార్కెట్ సెక్రటరీ సమక్షంలో రైతుల నుంచి మద్దతు ధరకు టమాటాలను కొనుగోలు చేసి,వివిధ ప్రాంతాల్లోని రైతుబజార్లకు తరలించడం ద్వారా రైతులను ఆదుకున్నామని వివరించారు.మార్కెట్‌ యార్డులో సుమారు 40 ఏళ్లుగా భారీవర్షాలు కురిసిన ప్రతిసారీ వరద నీరుచేరి మండీలు మునిగిపోతున్న సమస్య ఉందని జంగాల శివరాం తెలిపారు.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా రూ.50 లక్షలతో స్టార్మ్ డ్రైనేజీ పనులకు అనుమతి లభించిందన్నారు.పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని,త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.మార్కెట్‌యార్డులో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎస్.ఆర్ షాపింగ్ మాల్ సహకారంతో అత్యాధునిక ఆర్వో ప్లాంట్,వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.పాత మరుగుదొడ్ల స్థానంలో రూ.20 లక్షల వ్యయంతో నూతన టాయిలెట్ల నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయని,త్వరలో భూమిపూజ నిర్వహించి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.రైతుల సంక్షేమం,మార్కెట్‌యార్డు అభివృద్ధికి సహకరిస్తున్న కూటమి ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మార్కెట్ కమిటీ తరఫున జంగాల శివరాం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

కె. ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి