మునగ ప్లాంటేషన్ పనులను పరిశీలించిన జెడ్పీ సీఈఓ
సూర్య , లక్షెట్టిపేట : మండలంలోని అంకత్‌పల్లి గ్రామపంచాయతీ పరిధి శాంతాపూర్ హ్యాబిటేషన్‌లో విబిజీరామ్‌లో భాగంగా చేపడుతున్న మునగ ప్లాంటేషన్ పనులను గురువారం జిల్లా పరిషత్ జెడ్పీ సీఈఓ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ పనుల పురోగతిని అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
హక్కుదారులకు రోజుకు రూ.308 కూలీ వచ్చే విధంగా పనులు చేపట్టాలని సూచించారు. రేపటి నుంచి గ్రామపంచాయతీ పరిధిలో 60 మంది హక్కుదారులకు తగ్గకుండా పనులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పనులకు హాజరయ్యే హక్కుదారులకు సక్రమంగా ఉపాధి కల్పిస్తూ, పనుల నాణ్యతను పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఏపీవో, సాంకేతిక సహాయకుడు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.