క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తుంకుంటఆంక్ష రెడ్డి
క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తుంకుంటఆంక్ష రెడ్డి.
రాహుల్ గాంధీ ఆందోళనతో బిజెపిలో వణుకు పుట్టింది
.సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ .
గజ్వేల్ ; ప్రధాని మోడీ, సిఇసి, బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు ఓటు చోరికి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ బ్లాక్ డే లో భాగంగా గురువారం సాయంత్రం సిద్దిపేట డిసిసి అధ్యక్షురాలు తూoకుంట అంక్షారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్, బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం ఆంక్షా రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ తొత్తుగా మారినట్లు విమర్శించారు. దేశంలో అక్రమ పద్ధతుల్లో తిరిగి అధికారం చేపట్టేందుకే ఎన్నికల కమిషన్ ను కీలుబొమ్మలా వాడుకుంటుండగా, అది ఎంత మాత్రం సాగబోదని హెచ్చరించారు. ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల ఆందోళనను అడ్డుకోవడం సిగ్గుచేటు కాగా, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తూ దేశాన్ని, దేశ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్, ప్రియాంక గాంధీల పోరుతో కేంద్రంలోని బిజెపి సర్కార్ కు వణుకు పుట్టిందని, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి. పట్టణ అధ్యక్షుడు కొండల్ రెడ్డి, కౌన్సిలర్లు విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్, గుంటుకు శీను మాజీమైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ సమీర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వహీద్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు జహీర్, అంజి యాదవ్, గుంటుకు శ్రీనివాస్, సారిక శ్రీనివాస్ రెడ్డి, చెప్యాల శేఖర్, జహంగీర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.