BREAKING
లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.* అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్.. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించని స్టార్ హీరోయిన్ కార్మికుల కొరత పరిష్కారానికి లావోస్ తీవ్ర కసరత్తు: స్వర్ణాంధ్ర కాలేజి ని సందర్శించిన నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.. ఏమన్నారంటే? ఉత్తర కొరియా ముప్పుపై దక్షిణ కొరియా, జపాన్ రక్షణ శాఖల కీలక భేటీ: రూ.248 కోట్లతో నర్సీపట్నం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి! రూ.3 కోట్లతో వాకింగ్ ట్రాక్, కళ్యాణ మండపం పనులకు శ్రీకారం : స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇథియోపియా నేషనల్ ప్యాలెస్, మ్యూజియంను సందర్శించిన విదేశాంగ మంత్రి జైశంకర్ బీసీలకు టీడీపీ అండగా ఉంటుంది బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ బాలిక దినోత్సవం శీనయ్యకు..జిల్లా పెద్ద బాధ్యతలు..! కోట్యాడ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయుడు రంభ వెంకట రమణకు సన్మానం ఉపాధి పనులు వేగవంతం చేయాలి ప్రజాదర్బార్‌కు విశేష స్పందన.. స్వీకరించిన ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి -- జెసి కె.ఆర్. కల్పశ్రీ, విప్ నాయకర్

గద్వాల్ విజయలక్ష్మి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

Select Suryaa Now
గద్వాల్ విజయలక్ష్మి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

హైదరాబాద్, సూర్య ప్రతినిధి :బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ప్రకృతిపై ప్రేమకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఈ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ఈ బతుకమ్మ పండుగ ప్రతీ ఇంటా సంతోషాలు నింపాలని, రాష్ట్రంలోని మహిళలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని గద్వాల్ విజయలక్ష్మి ఆశాభావం వ్యక్తం చేశారు.