ఉపాధి పనులు వేగవంతం చేయాలి
బాడంగి, సూర్య: గ్రామ పంచాయతీల వారీగా ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి, ప్రతి కుటుంబానికి 125 రోజుల పని కల్పించాలని ఏపీడీ కె. రామామణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వి.బి. జీ రామ్ జీ సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఫార్మ్ పాండ్స్, సోక్ పిట్స్, కందకాల పనులు చేపట్టి కూలీలకు విస్తృతంగా ఉపాధి కల్పించాలని సూచించారు. మండలంలో మంజూరైన 80 పశువుల షెడ్లు నెల రోజుల్లో పూర్తి చేయాలని, ఆసక్తి ఉన్న రైతులను పశుగ్రాసం సాగుకు గుర్తించాలని, పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. పనులు నిర్దేశిత కొలతల ప్రకారం చేపట్టి లక్ష్యాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఏపీఓ కె. సాయిరాం, జేఈ ఎ. హరినారాయణ, టీఏఎస్, బీఎఫ్‌టీలు, ఎఫ్‌ఏఎస్‌లు పాల్గొన్నారు.