BREAKING
గాల్లో ఉండగా ప్రయాణికుడి పవర్ బ్యాంక్‌లో చెలరేగిన మంటలు దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు దేశద్రోహ, అంతర్జాతీయ శక్తుల కుట్రలు: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజం! రాగి ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్న అదానీ రాయల్ నేవీతో సంయుక్త విన్యాసాలకు సిద్ధం: 'ఎక్సర్‌సైజ్ కొంకణ్-26' కోసం యూకేలోని ప్లైమౌత్ చేరుకున్న ఐఎన్ఎస్ త్రిశూల్! నిరసనకారులపై ఢిల్లీ పోలీసుల దమనకాండ దారుణం: గురుద్వారా పవిత్రతను భంగపరిచారంటూ పంజాబ్ ఆప్ తీవ్ర ఆగ్రహం! నేటి రాశి ఫలాలు – 12 అక్టోబర్ 2026 నేటి పంచాంగం: 12 అక్టోబర్ 2026, సోమవారం రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే తప్పుడు ఆరోపణలు నెక్కొండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాలు ప్రారంభం క్రీడల్లో గెలుపు ఓటములు సహజం వెంకటాపురంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా నూతన కమిటీ ఎన్నిక మండల ఏర్పాటులో డాక్టర్ సుధాకర్ రావు దే కీలక పాత్ర దంతాలపల్లి లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు మూడో టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించిన టీమిండియా నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యం

అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

Select Suryaa Now
 అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

సూర్య నియోజకవర్గ బ్యూరో (డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా / పి.గన్నవరం): జనసేన పార్టీ అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నియమితులైన పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ, పార్టీ అధిష్టానం నూతనంగా ప్రకటించిన సమన్వయ కమిటీ సభ్యులకు, నిర్వాహక దళ్ సభ్యులకు, సపోర్ట్ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. నాయకత్వం అప్పగించిన బాధ్యతలను తు.చ. తప్పకుండా, పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తానని భరోసా ఇచ్చారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు నాయకులు, క్రియాశీల కార్యకర్తలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ మూల సిద్ధాంతాలను ప్రతి గడపకూ తీసుకెళ్లడంతో పాటు, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అండగా ఉంటూ ప్రజాసేవలో ముందుంటానని ఎమ్మెల్యే గిడ్డి తేల్చిచెప్పారు.