BREAKING
పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల ఠానేలంక గురుకులంలో న్యాయ విజ్ఞాన సదస్సు...విద్యార్థినులతో మేజిస్ట్రేట్ ముఖాముఖి... నేటి రాశి ఫలాలు: 11 అక్టోబర్ 2026. నేటి పంచాంగం 11 అక్టోబర్ 2026 తులిప్ స్కూల్‌లో సందడిగా పీపుల్స్ లీడర్ ఎన్నికలు.

పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన

Select Suryaa Now
పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన

కడియం ,మేజర్ న్యూస్,:రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కడియం మండలంలోని కడియపులంక, బుర్రిలంక గ్రామాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం మంజూరు చేసిన మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు.
బుర్రిలంక సుబ్రహ్మణ్యస్వామి ఆలయం సమీపంలో, ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో కడియపులంక పూల మార్కెట్ దగ్గర చేపట్టనున్న నిర్మాణ పనులకు ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాన్ని  సత్యనారాయణ, మాజీ ఎంపీపీ పంతం గణపతి, మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు  బోడపాటి గోపి, గట్టి సుబ్బారావు  తదితరులు శంకుస్థాపన చేశారు.

రాబోయే పుష్కరాలకు వచ్చే భక్తులు, పర్యాటకులకు అవసరమైన పారిశుధ్య సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. పుష్కరాల సమయానికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధితులు పాల్గొన్నారు.