BREAKING
మూడు పదవుల ముచ్చటేనా.. బాధ్యతల సంగతేంటి? బొడ్డు వెంకటరమణ కు మూడు కీలక పదవు లపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన, వ్యక్తిత్వ పోటీలు తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల

గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి

Select Suryaa Now
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి

అంబాజీపేట మేజర్ న్యూస్ : కే. పెదపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన స్వర్ణ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు  గిడ్డి సత్యనారాయణ  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

గ్రామపంచాయతీ కార్యాలయాలు గ్రామ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.