BREAKING
మూడు పదవుల ముచ్చటేనా.. బాధ్యతల సంగతేంటి? బొడ్డు వెంకటరమణ కు మూడు కీలక పదవు లపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన, వ్యక్తిత్వ పోటీలు తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల

మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్

Select Suryaa Now
మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్

దేవరపల్లి, మేజర్ న్యూస్:ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ప్రజాస్వామ్యానికే ప్రమాదకారిగా మారాడని, సీఈసీ  జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే బర్తరఫ్ చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని సిఐటియు మండల కన్వీనర్ ఎస్. భగత్ స్పష్టం చేశారు.శనివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దేవరపల్లి బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎస్. భగత్ మాట్లాడుతూ, దేశంలో బిజెపి ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోందని విమర్శించారు. శాంతియుత ఆందోళనలకు పిలుపునిస్తే మెట్రో స్టేషన్లను మూసివేయడం, ఇంటర్నెట్ నిలిపివేయడం, వేలాది మందిని ముందస్తుగా అరెస్టు చేయడం దారుణమన్నారు

.రైతు సంఘం సీనియర్ నాయకుడు ఉండవల్లి కృష్ణారావు మాట్లాడుతూ, దేశంలో 13 కోట్ల మంది ఓట్లను అక్రమంగా తొలగించారని, అందులో అత్యధికంగా వలస కార్మికుల ఓట్లే ఉన్నాయని ఆరోపించారు. ఆ ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని మరియు 2023 చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మర్రి రమేష్, కే.ఎస్. గురుమూర్తి, తుట్ట ఏసు, వేల్పూరు దుర్గారావు, పిన్నమనేని సత్యనారాయణ, సిర్ర రాజు, కే. రత్నాజీ, అడపా సూర్యారావు, పుల్లూరు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.