ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు..
అమలాపురం మేజర్ న్యూస్ చైతన్య గ్రూప్ చైర్మన్ కె వి వి సత్యనారాయణ రాజు చైతన్య రాజు, కిమ్స్ ఎండీ రవి వర్మ ల ఆధ్వర్యంలో అమలాపురంలో 36 వార్డుల్లో 3,600 మంది విద్యార్థులు, సిబ్బందితో ఘనంగా 'స్వచ్ఛ అమలాపురం కిమ్స్ కోనసీమ హాస్పిటల్ ఆధ్వర్యంలో చైతన్య గ్రూప్ చైర్మన్ చైతన్య రాజు కిమ్స్ ఎండీ రవి వర్మ నిర్వహించిన స్వచ్ఛ అమలాపురం'పరిశుభ్రతా కార్యక్రమం చాలా అట్టహాసంగా జరిగింది.
ఈ భారీ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ 3,600 మంది విద్యార్థులు మరియు సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొని శ్రమదానం చేశారు. అమలాపురం పట్టణంలోని మొత్తం 36 వార్డులలో ఒకేసారి ఈ పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించి, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని కిమ్స్ విద్యార్థులు, సిబ్బంది కూటమి నాయకులతో కలిసి శ్రమదానం చేశారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ, పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టడంలో భాగంగా పట్టణంలోని ప్రతి ఇంటికీ ఉచితంగా ఒక జూట్ బ్యాగ్ సంచి అందించాలని అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్ గారిని ఆదేశించారు.మన రాష్ట్రంలో అమలాపురం పట్టణాన్ని స్వచ్ఛతలో ప్రథమ స్థానంలో నిలపాలనే లక్ష్యంతో, కిమ్స్ నడుం కడుతుందని కిమ్స్ అధినేత చైతన్య రాజు అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం నాయకత్వాన్ని ఆయన ఈ సందర్భంగా విశేషంగా కొనియాడారు.ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ విడుదల చేసిన సూచనల ప్రకారం, ప్రతి ఒక్కరూ చెత్తను తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, శానిటరీ వ్యర్థాలు, ప్రమాదకర వ్యర్థాలుగా వేర్వేరుగా విభజించి మున్సిపల్ సిబ్బందికి అందించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో తగలబెట్టకూడదనిఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకూడదని మరియు అన్ని రకాల వ్యర్థాలను కలపకుండా వేర్వేరుగా ఉంచాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే స్వచ్ఛ అమలాపురం ముఖ్య ఉద్దేశమని, ఇందులో ప్రతి పౌరుడూ బాధ్యతగా మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, కిమ్స్ హాస్పిటల్ ప్రతినిధులు, వైద్యులు, మున్సిపల్ అధికారులు, ఉపాధ్యాయులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.